పుట:Naayakuraalu.Play.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

పోరడమంటే కత్తులతో పోరాటమేగాదు. కత్తులూ ఫిరంగులూకూడా సమకూర్చలేని విజయం సత్యవ్రతం సమకూర్చుతుంది. దీనిది క్రౌర్యంలేని ప్రతాపం. అహింస దీనికి వేరు. ఇతరులు హింసించినా నిరోధించక సహించడం వృక్షం. ప్రేమ దీని ఫలం. ఈ పోరాటంలో శత్రుత్వసంహారమే గాని శత్రుసంహారం లేదు. ఇటువంటిపోరు నాకు చాలా యిష్టం.

1-వ రంగము

మాచర్ల - రాజుగారి గృహం

[మ. దే. రా. బ్ర నా; బాలుడు; కొమ్మరాజు మొ. వారు ప్రవేశము ]

బ్రహ్మ: తా నొకటి తలంచితే దైవమొకటి తలంచాడన్నట్టయింది.

మ. దే. రా : కాదు, కాదు, మన మొకటి తలంచితే నాగమ్మ మరొకటి తలంచింది. అంతా మాయగారడి మోస్తరయింది. బెరస నెవలికి లొంగిపోవడమే ఆశ్చర్యం.

బా. చం : బెరస రంగంలో నిలుచుంటే అభిమన్యుడు పద్మ వ్యూహంలో పోరుతున్నట్లున్నది. దాని అయిదు తన్నులూ అశ్వినజారిపోయినవి. చిత్రంగా కొంకి మెడకు తగులుకొన్నది. మునివేళ్ల కందుతున్న గురిజాలరాజ్యం యెగిసి