పుట:Naayakuraalu.Play.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

67

ముందు మన్వాది మహర్షు లేలపనికివస్తారు ? చెట్టు చెడు కాలమున కీ కుక్కమూతిపిందెలు. దేశాన్ని పంచుకొని తినే పాలకులు, స్వార్థపరులై పరులనాశ్రయించి పైకి రా గోరే ప్రజలు. దేశ మీ దుర్గతికి వచ్చింది.

ఎందుకీ గంట? ఎవరురా అది ?

నౌకరు : ( ప్రవేశించి) సహాయమంత్రిగారు అగత్యముగా తమతో మాట్లాడగోరుతున్నా రు.

నాయ : ఇప్పు డెంతపొ ద్దయినది ?

నౌక : తోలికోడి కూసింది.

నాయ : మెల్లాలోకి తీసుకొనిరా. ( ఇద్దరు వెళ్లుతారు)

( నాయకురాలు, నరసింగరాజు ప్రవేశము )

నాయ: రాజుగారూ ! దయచేయండి. తమకు నిశాచరత్వ మబ్బినట్టున్న దే?

నర : సాహచర్యదోషం.

నాయ : నాకు ఈ రాత్రంతా అనిమిషత్వ మబ్బిందిగాని రాత్రించరత్వం పట్టలేదే !

నర : నిశాచరులూ ఒకప్పు డనిమిషులే. ఈ రాత్రి నాకు రెండుగుణాలూ ఏకకాలమందే పట్టుబడ్డవి. రాత్రి గంగవరం బోయి కట్టుబోతును పట్టుకొని వచ్చా. వాడి మాయకోడిని యాభై మొనగాడికోళ్ల మీద వదిలి చూశా. ఒక్కొకదానికి అయిదునిమిషాలు పెట్టలేదు. వరుసగా నరికి పోగులు బెట్టింది.