పుట:Naayakuraalu.Play.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

నాయకురాలు

1వ-రంగము

అభ్యంతరమందిరముయొక్క పంచపాళి.

[ ప్రవేశము - నాయకురాలు మేజాబల్లమీద కూర్చొని ]

నాయకురాలు : (స్వగతం) రెండుజాములకు మిగిలింది. నిద్దురపట్టదు. కందిరీగలవలె తలంపులు నన్ను పట్టి పల్లార్చుతున్నవి. చుక్కలకంటె మిక్కిలయినవి. దిక్కుతోచడం లేదు. గగనచారులైన ఓ గ్రహసత్తములారా ! లోకమున కంతకూ భావిసూచకులయిన మీరై నా మార్గము సూచించలేరా? లేక మీశక్తికికూడా మించిందా ?

శ్రుతిమించి రాగాన పడుతున్నది. సమత్వమను పేరుపెట్టి మాలమాదిగలను రెచ్చగొట్టి అందరిమీదికి ఎక్కొలుపు తున్నాడు. ఏమిఘోరము! చాపకూడట. సర్వము జగన్నాథమయిపోతున్నది. చన్న కేశవాలయము చండాలులపర మయినది. అంతయు చెడినది. వర్ణాశ్రమధర్మాలు వరద గలిసినవి. వేదములు, యజ్ఞోపవీతములు త్యాజ్యము లట. సంస్కృతము పనికిరాదట, వ్యాస వాల్మీకాది మహాకవుల విజ్ఞానామృతము పందికి పన్నీటివలె వీరికి పనికిరాదు గామాలె. బ్రహ్మనాయుడా ! నీకై అంతగా వగవనుగాని నీవు జన్మించి పల్నాటిని పరిహాసాస్పదము జేస్తున్నావని నాకు విచారము.

మాలలు, మంగలులు, చాకలులు, కుమ్మరులు మత ప్రచారకులట! వీరాధివీరుడయిన పిచ్చిరెడ్డి మాలకన్నడి క్రింద వాహినీపతి. పండువంటి బ్రాహ్మణుడు-ఆ అనపోతునుమాలపోతులలోగలిపావు. నీ మతప్రచారకుల