పుట:Naayakuraalu.Play.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

నాయకురాలు

నాయ : చిత్రం ! కారణ మేమని వూహిస్తారు ?

నర : తాను మంత్రకట్టు కట్టాననీ, ఎదటికోడిదెబ్బలు తనకోడికి తగలవనీ అంటాడుగాని నే నమ్మను.

నాయ : మఱి మీ అభిప్రాయమేమిటి ? ఏదో అసాధారణ ప్రజ్ఞ కొంత వున్నదంటారా?

నర : మంత్రకట్టనుకోనుగాని కొంతప్రజ్ఞ లేకేమి ? కోడికి యీకెలలో యేదో యినుపతీగెలతో అల్లినకవచం తొడిగి వున్నదనుకొంటాను. దాన్నిమనలను ముట్టుకోనియ్యడు.

నాయ : ఏ పిల్లెయితేనేమి. ఎలుకనుబట్టితేసరి, వాణ్ణి నమ్మి మనం పందెం వొడ్డవచ్చునా ?

నర : నిరభ్యంతరంగా వొడ్డవచ్చు. బ్రహ్మనాయుడూ నాయకురాండ్ర మంత్రశ క్తికంటే వాడి మంత్రశక్తి ఎక్కువ శక్తిగలదని రుజువవుతుంది.

నాయ : నాయుడు పందేనికి మొగ్గేనా ?

నర : నాగమ్మగారిమంత్రశక్తి నాయుణ్ణి మొగ్గించడములోనే వున్నది. మొగ్గుతాడనే నా నమ్మకం.

నాయ: ఎందుకని?

నర : ఆయనకింకా తగినంతసిబ్బంది పోగుగాలేదు. నాయకురాలు రెడ్డిసేనలతో యెప్పుడు వచ్చి మాచర్లమీద పడుతుందోనని భయపడుతున్నాడట. యుద్ధము చేయకుండా నాగమ్మను వోడించేమార్గం యేదయినా కనపడితే తప్పక సంతోషిస్తాడు.