పుట:Naayakuraalu.Play.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

61

అందరు : శ్రీమద్రమారమణగోవిందోహరి.

బ్రహ్మ: అయ్యా ! తమ రందరు భోజనానికి లెండి,

[అందరు లేతురు, తెరపడుతుంది.]

4-వ రంగము

బ్రహ్మనాయుడి సావిడి

[ బహ్మనాయుడు, కన్నమనీడు ప్రవేశము ]

బ్రహ్మ : కన్నా ! బండి రోడ్డెక్కిందనుకున్నాం. మళ్లీ రొంపిలో కూరుకున్నది. నాయకురాలు కొరుకులు వేసింది లాగడం కష్టం. వదలిపెట్టి పోలేము. నరసింగరాజును మంత్రిగా నియమించినట్లయితే సమదీటుగా వుండే వాండ్లము. కాని అతడు గొప్ప త్యాగమే చేశాడు.

కన్న : మనిషి దుర్మార్గుడయినా అన్నయందు మిక్కిలి గౌరవం. మాచర్ల మన కియ్యడము అతని కేమాత్రం యిష్టంలేదు.

బ్రహ్మ: నరసింగరాజు చాలా దూరదృష్టిగలవాడు. నాయకురాలిని నియమించడం అతని సలహాయే అనుకుంటాను. దానితో రంగమంతా మారిపోయింది. కాయలను వెనుకకు తిప్పకపోతే ఆట కట్టుతుందేమో.

కన్న : ఎత్తుకోవడంతోటే షహా అన్నదే నాయకురాలు.

బ్రహ్మ : మనము వెనుకకు తగ్గినంతమాత్రముచేత వెంటబడే మనిషిగాదు. పక్క దాట్లుకూడా కాచుకోవాలె.