పుట:Naayakuraalu.Play.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

నాయకురాలు

కన్న : ఆమె కత్తికీ, కార్యాలోచనకూకూడా మన మెదురడ్డగలము గాని దేశములో ఆమెకున్న పరపతి ప్రతిఘటించడం దుర్ఘటం. మనకు మంది చాలుగాని మార్బలం తక్కువ.

బ్రహ్మ: మనకు దైవబల మున్నది. దానికి మించింది లేదు.

కన్న : అది సరే, మాచర్ల చన్నడు మనకూ, గురిజాల యిష్ట కామేశుడు ఆమెకూ వున్నారు. ఆ బలాలు మినహాయించి. మనం మాట్లాడుదాం.

బ్రహ్మ: నాకు ప్రతివీరు డేడీ ? ఆ(-

కన్న : అటు తమకు ప్రతివీరుడు లేనిమాట వాస్తవం.

బ్రహ్మ : నీవు, బాలుడు, అనపోతు, లంకన్న నాతోటివాండ్లే..

కన్న : అపచారం. తమ తరువాతి వాండ్లం.

బ్రహ్మ : అటు రాజు ధైర్యంజేసి రణరంగంలో నిలిస్తే అమోఘంగా పోట్లాడుతాడు. నాయకురాలు, నరసింగరాజు, వీరా రెడ్డి అతిరథులలోనివాండ్లే అయినా అటు నాయకబలం తక్కువ.

కన్న : సేనలు లేనిది నాయకు లేమిచేస్తారు ? మనకు పంచము లెందరు పోగయినా వారి సేనలో పదోవంతుండరు.

బ్రహ్మ : మనవాండ్లకు మతోత్సాహ మెక్కువ. అటు సైనికులు శిక్షలో ఆరితేరినా మనవాండ్ల మతోత్సాహం ముందు నిలువలేరు

కన్న : నాయకురా లీ భేదం కనిపెట్టకపోలేదు. వర్ణాశ్రమ రక్షణ మనే పేరుతో ఉత్సాహం పెంచుతుంది. అయినా మనవాండ్లకున్న తెంపు వాండ్ల కుండదు.