పుట:Naayakuraalu.Play.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

నాయకురాలు

నర : ఆయౌవన మీ సుందరవనమును సహితము యౌవన వంతము చేస్తున్నది.

నల : ఒక కొమ్మ అడ్డమువచ్చి యాతనిం గౌగలించు కొంటున్నది.

నర : లతకన్నియ లాతని వెడదయురము నలముకొని పెనవేసుకొంటున్నవి, ఏమి వాని భాగ్యము !

నల : వనమునంతా సమ్మోహింపజేస్తున్న ఆ మూర్తిని మన మాహ్వానింతాము.

నర : అది యుక్తమే. సౌందర్యము యౌవనమునకు వశవర్తినియై సపర్యలు చేస్తుందిగదా. ఈ వనసౌందర్యమున కీ యౌవనుని పట్టాషిక్తునిజేతాము.

నల : యౌవనము, సౌందర్యము అన్యోన్యాశ్రయములు, పర్యాయపదాలుగూడాను. యౌవను డెప్పుడూ సౌందర్యానికి పట్టాభిషిక్తుడే.

నర : సౌందర్యమునకుమాత్రమేకాదు, శౌర్యధైర్యములూ ఆతని వశములే.

నల : సుగుణములు విగుణా న్నెప్పుడూ ఆశ్రయించవు. దేహసౌష్టవమూ. మనోవికాసమూ పరమమిత్రములే. గుణసంపన్నుడయిన యౌవను డన్నిటికి పట్టాభిషిక్తుడే.

(యౌవనుడు ప్రవేశము )

యౌవనుడు : రాజా ! జోహారు ; మిత్రులకు నమస్కారములు.

కే : (నరసింగరాజుతో) అయ్యా, ఒక సందేహము. నిన్న శంకరునకు సపర్యలుచేస్తున్న, గంగాసమానురాలగు పవిత్రరూపమేనా యిది ;