పుట:Naayakuraalu.Play.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

41

నల : పల్నాడు యింకను పూర్తిగా మానవుడికి స్వాధీన పడ్డట్టు లేదు.

నర : ఇప్పుడుసహా, వృక్షసృష్టీ, జంతుసృష్టీ, మనుష్యసృష్టీ మూడూ స్వాధికారానికై ఒకదానితో వొకటి పల్నాటిలో పోరుతునే వున్నవి.

కే : మనుష్యుని గొడ్డలి ఎప్పుడూ వూళ్ల చుట్టూ ఆడుతూ వుండవలసిందే. కాస్త ఏమార్లితే వూళ్లు అడవి వేసిపోతవి.

నల : ఇప్పు డెంత ప్రొద్దయింది ?

కే : కిరణములు నిలువుగా పడుతున్నవి. రెండుజాములు కావచ్చింది.

నర : చండకిరణుడు తన యెండను గోల్పోయి చంద్రమండలము ననుకరించుతున్నాడు.

కే : కిరణములు వేడిమినిమాత్రమేకాక తెల్లదనమునూ గోల్పోయి పందిటికి గట్టిన పచ్చతీగలవలె వ్రేలాడుతున్నవి.

నల : ఆవరణముయొక్క ప్రభావంచేత యిచ్చట సర్వమూ వనసామ్యమును పొందుతున్నది.

ఎవ రా యౌవనుడు? వేట కరుదెంచిన వసంతకుమారునివలె వున్నాడు.

కే : యౌవనము మూర్తీభవించినట్లున్నది. గాండీవము ధరించిన అర్జునకుమారుడా యేమి ?

నర : ఇట్టి పురుషసౌందర్యమును నే నెన్నడూ చూడ లేదు.

నల: ఆ యౌవనమునకు యీ వనసౌందర్య మెంతో పొందిక గా వున్నది.