పుట:Naayakuraalu.Play.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

43

నర : పురుషరూపమును ధరించిన నాగాంబికనా మన మిప్పుడు. చూస్తున్నాము !

నాగాంబిక : అయ్యా ! యీ వేషమును మన్నింపుడు.

నల : పల్నాటిరాజ్యమునకు సర్వాధికారములతో అమాత్య పదవికి ఈమె నభిషిక్తురాలను జేస్తున్నాము.

నాగాంబిక : పల్నాటిరాజ్యమున కంతకును మిమ్మును ప్రభువునుగా నభిషిక్తుని జేస్తున్నాము.

కేతు ; నర : ఉభయుల ఆశీర్వచనములూ ఫలించునుగాక !