పుట:Naayakuraalu.Play.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

నాయకురాలు

యుద్ధం పొసగకుండా మాచర్లమండలం మన కిచ్చే సదుపాయం చేయవలసినదని మా ప్రార్థన.

మ. దే. రా : తాంబూల మీయ్యండి.

[ అంతా సష్క్రమిస్తారు తెరపడుతుంది ]

2-వ రంగము

[ నౌకరు ప్రవేశము చెర్లగుడిపాడు ]

నౌ : ఎవరా వచ్చేది ! వారేలాగున్నారు.

[ అలరాజు ప్రవేశము ]

అ. రా : ఇ దేవూరు ?

నౌ : చేర్లగుడిపాడు. మంత్రిగారికోసం వచ్చారా ?

అ. రా : ఏమంత్రిగారు ?

నౌ : నరసింగరాజుగారు, అదే వారి బస. ఇప్పుడు ఖాళీగానే వుంటారు, చూడవచ్చు.

అ. రా : నీవు వారి నౌకరువా?

నౌ : అవును తను నౌకరునుమాత్రం కాదా? తమరు పెద్ద దొరవారి అల్లుడుగారుగదా? దేశంలోకి మళ్లీ వచ్చారని అనుకుంటున్నారు.

అ. రా : ఎవ రనుకుంటున్నారు ?

నౌ : దేశమంతా అనుకుంటున్నారు. చిన్నదొరగారుగూడా ఎప్పుడూ అనుకుంటూనే వుంటారు.

అ. రా : ఏమనుకుంటారు?