పుట:Naayakuraalu.Play.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

107

బ్రహ్మ : రాయబారం విషయమయి మనలో అభిప్రాయ భేదాలు తీవ్రంగా వున్నవి. ఎటు జూచినా రాయబారమే ఉత్తమంగా నాకు కనబడుతున్నది.

మ. దే. రా : రాయబారిని ఏర్పాటుచేయండి.

క. దా : అలరాజుగారిని రాయబారిగా పంపితే బాలుడు చూపించిన చిక్కు లుండకపోవచ్చు ! ఆయన ఉభయులకూ అక్కరగల మనిషి

బా. చం : లోకానుభవంగలవారు, వారి తండ్రిగారిని పంపగూడదా?

బ్రహ్మ : అల్లుడు మొగమోటపెడితే నలగామరాజు తీసివెయ్య లేడు. తండ్రిగారికంటె కొడుకును బంపడమే మెరుగు.

కొమ్మ : నే వెళ్లుతాలెండి.

బ్రహ్మ : ఆయనకు అల్లుడిమీద మక్కు వెక్కువ. అలరాజు వెళ్లి తే అంతఃపురం మనపక్షమవుతుంది.

మ. దే. రా : ఇంతతర్క మెందుకు ? వెళ్లడానికి అలరాజు అంగీకరిస్తాడా?

కొమ్మ : అతని అంగీకారమేమిటి? అంతా వెళ్లమంటే వెళ్లుతాడు.

అ. రా : నా అభ్యంతరంలేదుగాని నరసింగరాజు కేటించి గట్టిపట్టు పట్టితే నామాట సాగదు.

బ్రహ్మ : చేతనయిన ప్రయత్నం చెయ్యండి. రేపు ఉదయం ప్రయాణం. మీకు ప్రత్యేకంగా ఎత్తిచెప్పవలసిన దేమున్నది ? మనది కుంటుంబ కలహం. ఉభయులకూ నష్టకరమయిన