పుట:Naayakuraalu.Play.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

109

నౌ : తమరు మంచివారనీ, ఇతర్లమూలంగా కష్టాలుపడుతున్నారనీ, అనుకుంటారు. ఇప్పుడు నే బోయిచెప్పితే వారే పరుగెత్తుకుంటూ వస్తారు.

అ. రా : ( స్వగతం) (ఇతని మాటలనుబట్టి వారు చాలా సుముఖంగా వున్నట్లు కనబడుతారు. వారు అనుకూలిస్తే మనకార్యమే నెరవేరుతుంది. ) ( ప్రకాశముగా) వారు రావడమెందుకుగాని నేనే నస్తా, దారి జూపు.

నౌ : చిత్తం, దయచెయ్యండి దేవర !

[ ఇద్దరూ తెరలోపలికి బోతారు ]

[నరసింగరాజు, నౌకరు ప్రవేశము ]

నౌ : అలరాజుగారు యిక్కడికే వచ్చారు.

నర : ఇక్కడి కెట్లా వచ్చారు ?

నౌ : పొద్దటినుంచి నే పడమటి డొంక కాచేవున్నా. దూరంగా చూచి వూళ్లోకి పరుగెత్తి అడ్డబజారున వారి కెదురుబోయి మిమ్ములను చూడడానికి యిక్కడికి తీసుకొనివచ్చా. వంట యింట్లోకి కుందేలు వచ్చి దూరింది.

నర: నే గురిజాలకు ప్రయాణమవుతుంటినిగా, ఆ మాట చెప్పి లోపలికి తీసుకురా.

నౌ : ఆయ్యా, లోపలికి దయచెయ్యండి. అయ్యగారు గురిజాలకు ప్రయాణమై చెప్పుల్లో కాళ్ళుబెట్టుకొనివున్నారు.

[ అల రాజు ప్రవేశము ]

అ. రా : తమరూ ప్రయాణమౌతున్నట్లున్నారు !