పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 నాట్యకళ


విజయలక్ష్మీవిరాజితుడై శ్రీ మహీపాల దేవుడు చండకౌశికము నాడించెను. దిగ్విజయానంతరము కుమారునికి పట్టముగట్టి గోపాలవర్మ మహారాజు శాంతరసప్రధానమగు ప్రబోధచంద్రోదయము నాడించెను. అట్లే శ్రీ యువ రాజదేవుడు విద్ధసాలభంజికను, మహేంద్రపాల దేవుడు బాలరామాయణమును, శ్రీ నిర్భయ నరేంద్రనందనుడు బాలభారతమును, ప్రతాపరుద్ర గజపతి చైతన్య చంద్రోదయమును, మహారాజ గోవర్ధనధారి కంసవధను ప్రయోగింపజేసినట్లు కలదు. శ్రీహర్ష మహాకవి చెప్పినట్లు—

'రాజ్యం నిర్జితశత్రు యోగ్యసచివే న్యస్త స్సమస్తో భరః
సమ్యగ్లాలిత పాలితాః ప్రశమితాశేషోవసర్గాః ప్రజాః,
ప్రద్యోతస్య సుతా వసంతసమయ స్వంచేతి నామ్నా ధృతిం
కామః కామ ముపై త్వయం మమపున ర్మన్యే మహా నుత్సవః.'

అను నకలుషిత సుఖమయావస్థలో నట్టి విలాసప్రధానములగు నాటకములే యొప్పియుండును.

కాని యిప్పుడన్ననో జాతీయనైతిక సాంఘిక రాజకీయ సంఘరణముల సుడిబడిన యాకువలె ప్రతిమానవుడు వీరతిలేక సంక్షోభించుచుండ, అంతులేని బానిసతనమున నెంతవానికి బ్రదుకుటయే దుర్ఘ టమగుచుండ, అగ్ని పర్వతము భేదిల్లినట్లు ఒక్కొకధర్మము బ్రద్దలుగా నాయాపదనుండి తప్పికొన దేశమంతయు తనశక్తిని ధారపోయవలసియుండ విలాసముమాట స్మరింపనైన నవకాశమున్నదా! చేతినిండుగా పనిగలవాడు సంగీతము నానందించుచు గూర్చుండ జాలడు గదా? కాబోవువానికి కావ్యముకంటే కార్యము ప్రధానమగును, ప్లేటో (Plato) సుధీమణి తన రిపబ్లిక్ (Republic) అను మహాగ్రంథమున కావ్యనాటకాదుల దెస ని ట్లనాదరణ జూపియున్నాడు:

“Let us assure our sweet friend (Poetry) and the sister arts of imitation (drama etc.,) that if she will only prove her title to exist in a well-ordered state, we shall be delighted to receive her. . . we are very conscious of her charms, but we may not on that account betray the truth. . . Shall I propose, then, that she be allowed to return from exile, that she makes a defence of her-self. . . Let then (the lovers of art and poetry) show not only that she is pleasant but also useful to states and to human life we will listen in a kindly spirit." but on this condition only,

ప్లేటోసుధీమణియభిప్రాయమును మన్నించి కొందరు పండితులు కళల యందు విలాసమును, విజ్ఞానమును (fancy and wisdom) కూడ పొడకట్ట