పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 నాటకప్రయోజనము విలాసమా, విజ్ఞానమా


“Lying, the telling of beautiful untrue things, is the proper aim of art"

—Oscar Wilde

"A poem is that species of composition which is opposed to works of science, by proposing for its immediate object pleasure not truth"

—Coleridge

సంస్కృత నాటకకర్తల యభిప్రాయమును ముఖ్యముగ పై యర్థమునే బలపఱచునట్లు పొడకట్టును—

‘అపినామ స్వయమేవ కవితాకోవిదాః పారిషదాః, అన్యసూక్తిభి
ర్వినోదయిష్యంతే.'
'అపి ముదముపయోంతో వాగ్విలాసైః స్వకీయైః
పరభణితిషు తోషం యాంతి సంతః కియంతః'

—ప్రసన్న రాఘవము

'యద్యేవ ముద్దామశబ్దార్థ సన్ని వేశ శిల్పాక లేన
కేనాపి రూప కేణ వినోదనీయా వయమితి'

—మల్లికామారుతము

‘రసాస్వాదన తరలా యే మాద్యంతి విపశ్చితః,
తఏవ భావుకా లోకే భవంతి హృదయాలవః'

—ప్రతాపరుద్ర కల్యాణము

‘ప్రీతిర్నామ సదస్యానాం ప్రియా రంగోపజీవినః'

—అనర్ఘ రాఘవము

శేషకృష్ణ విద్వత్కవియు తన కంసవధనాటక మున-

‘తద్యావ దేతాం నిజవిజ్ఞానోపహారేణోపదిష్టే' అని విజ్ఞానపక్షపాతము జూపగా సామాజికులు (audience) వినోదమునే వాంఛించిరి, 'దూరాధ్వ సంచార పరిశ్రాంత స్వాంతాన్ అస్మాన్ కేనచి దభినవగ్రథితవస్తునా ప్రయోగేణ భగవత్కృపానుబంధినా వినోదయ' అని, కళలను, ముఖ్యముగ నాట్యమును కేవలముగ ప్రీతికొఱకే యుద్దేశించిన పాశ్చాత్య పండితులేమి, భారతీయ విద్వాంసులేమి — 'ఈశ్వరాణాం విలాసశ్చ' అనునట్లు సంపూర్ణ సంపదలతో తులతూగుచున్న తత్తత్కాలములననుసరించి యట్లు ప్రవచించిరి. దేశము సుభిక్షమై మతసాంఘిక రాజకీయాందోళన లెవ్వియు లేని కాలమున పండువగా నొకానొకప్పుడు నాటకము లాడుకొనుచుండుట గలదు.