పుట:Naajeevitayatrat021599mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహించి, “ప్రకాశంగారూ! నేను ఏలూరి లక్ష్మీనరసింహంగారి మాయ మంత్రంలో పడను. రేపు రామచంద్రరావుగారిని ఒకసారి పంపించండి! కలెక్టరుకి నా నామినేషన్ ఉపసంహరించుకునే ఉత్తరం వ్రాసి ఇస్తాను," అన్నాడు.

మర్నాడు రామచంద్రరావు ఆయనదగ్గిరికి వెళ్ళి, ఉత్తరం తీసుకున్నాడు. రామచంద్రరావుపంతులుగారు పోటీ లేకుండా చైర్మన్ అయ్యారు.

రామచంద్రరావు పంతులుగారు సుబ్బారావుపంతులుగారి వరవడి దాటనివాడని ఇదివరకే వ్రాశాను. ఆయన ఆ జన్మాంతమూ వదలని అ తలపాగా, ఆ నడికట్టూ, ఆ బుజంమీదా కర్రా, నాకు ఇప్పటికీ కూడా కళ్ళకి కట్టినట్టున్నాయి. ఆయన సహజంగా శుద్ధ మితవాది. దానికితోడు న్యాపతివారి గురుత్వం. రామచంద్రరావుగారి దినచర్య ఆశ్చర్యంగా వుండేది. తెల్లవారి లేస్తూనే ఆయన కర్ర బుజాన వేసుకుని ముందు గ్రామమునసబు కోటీశ్వరరావుగారిని పలకరించి వెళ్ళేవాడు. తరవాత తాసిల్దార్ ఇంటిమీదుగా వెళ్ళి, ఆయన్ని పలకరించేవాడు. ఒకసారీ సబ్ కలెక్టరు శిరస్తాదారు రామభద్రుడుగారిని పలకరించేవాడు. మొత్తంమీద ఉద్యోగస్థుల ప్రాపకంకోసం తికమకలు పడుతూ వుండేవాడు.

రామచంద్రరావుగారు ఛైర్మన్ అయిన తరవాత ప్రజల అసంతృప్తికీ, ఆగ్రహానికీ పాత్రులు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన పరిపాలనలో ఎక్కువగా ఉద్యోగస్థుల సలహాలు అనుసరించే పోయేవారు. కాని, ప్రజల అవసరాలు అవగాహన చేసుకుని సంతృప్తి పరచలేకపోయేవారు. ప్రతి విషయమూ ముందు కలెక్టరుతో సంప్రదించి ఆయనకి ఇష్టమైతేనే ముందు అడుగు వేసేవారుగాని, ప్రజల అవసరం గ్రహించలేక పోయేవారు. రైస్ పార్టీవాళ్ళు నిస్పృహ చెంది, 'ఆ పక్షంలో రైన్ నే పెట్టుకో లేకపోయామా" అని నాతో చెప్పేవారు. ఆయన ఏ విధమైన కొత్తపద్ధతులూ ప్రవేశపెట్టలేకపోయారు. చివరికి ప్రజలకీ, ఆయనకీ కూడా ఆవిషయంలో విసుగు కలిగింది. ఇల్లా వుండగా, ఆప్పట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కి తెలుగుజిల్లా