పుట:Naajeevitayatrat021599mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారికి నేను వుండడమో, లేక ఆయన ఉండడమో అంతేగాని తనకి ప్రత్యక్ష ప్రతికక్షి అయిన పంతులుగారి శిష్యుణ్ణి ఈ పదవి కెక్కించడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. లక్ష్మీనరసింహంగారు ఆ కారణంచేత కూడా రైసుని బాగా ఎగసనతోశారు.

రైసు కాన్వాసింగు చాలా బలమైనది. అప్పటికి ఇన్ కంటాక్సు అధికారం సబ్ కలెక్టరుదే కనక, ఆలపాటి భాస్కరరామయ్యగారు, మారడుగుల వెంకటరత్నంగారు మొదలయిన వైశ్యసభ్యులంతా కేవలమూ భయంచేత రైసుకి అనుకూలంగా మెత్తబడ్డారు. రైస్ నామినేషను, మోచర్ల నామినేషను కలెక్టరు దగ్గిర దాఖ లయ్యాయి. ఎప్పడైతే బసవరాజు గారు నా దగ్గిరికి వచ్చి రైస్ ఆలోచన నాతో చెప్పారో, ఎప్పుడైతే షాహుకార్లు మెత్తబడు తున్నారో అప్పడే నేను రామచంద్రరావు పంతులుగారితో జాగ్రత్తగా పుండమనీ, ఒకసారి రైస్ ని చూడ మనీ చెప్పాను. దానిమీద రామచంద్రరావుగారు ఆయన్ని చూడడానికి ఇంటికి వెళ్ళగా రైస్ ఆయన్ని చూడనని కబురు పంపించాడు. రామచంద్ర రావుగారు నిస్పృహతో తిరిగి వెనక్కి వచ్చేశారు. మరి రెండు రోజులకి మునిసిపల్ కౌన్సిలు మీటింగు జరిగింది. ఆ మీటింగుకి మా పార్టీ పూర్తిగా హాజరై మునిపిపల్ కంట్రాక్టు వ్యవహారాలని గురించి కొన్ని విషయాలు సేకరించి, వాటినన్నిటినీ ఒక సీలు వేసిన కవరులో పెట్టి, రైస్ ని ప్రశ్నలు వెయ్యడం లంకించుకుంది: మేము ఓవర్సీరుని పిలిపించి సమాధానాలు చెప్పించమన్నాము! చాలావరకు చర్చ అయ్యాక రైస్ నన్ను ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడమని కోరారు. నేను సరేనని ఆ మర్నారు రైస్ ఇంటికి వెళ్లాను. ఆయనకి ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని గురించి గట్టిగా చెప్పొను. "రిప్పన్ ప్రభువు చేసిన ఈ మునిసిపల్ ఆక్టు ఉద్దేశం ఉద్యోగస్థులు పరిపాలన చెయ్యడం కాదనీ, తను పోటీ చెయ్యకూడదనీ, ఇదంతా ఏలూరి లక్ష్మీనరసింహం గారి ప్రోత్సాహమనీ, 'కాదు కూడదని' నిలబడితే మా పార్టీ బలంగా నిలబడి ఓడిస్తామనీ చెప్పాను. రైస్ విషయం అంతా సమగ్రంగా