పుట:Naajeevitayatrat021599mbp.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దృష్టమనే భేదభావాలు లేకుండా ఉన్నవి. జయాపజయాలు వ్యక్తిగతంగా నన్ను ఆందోళన పరచవు. ఈ రోజున ఆ స్థలం వారికిచ్చి ఈ స్థలానికి నేను రావడ మన్న దానిని సంతోషపూర్వకంగానే చేశాను.

[హియర్! హియర్! వినుడు! వినుడు! - సభలో ప్రశంసలు]

"నేను ఎవరి చేతులలోకి ఈ పరిపాలనా యంత్రాన్ని అప్పజెప్పానో - వారు, నా అనుభవములవంటి అనుభవాలు పొందకుండా పని సాగించుకోవలెనని నా కోరిక...

"ఈ విశ్వాసరాహిత్య మన్న భావ మెలా వచ్చింది? నాలో ఏవైనా తప్పులున్నా, లేకున్నా ఒకటిమాత్రం చెప్పగలను. పరిపాలనా విధానంలో ఏవిధమైన అసంతృప్తీ కలుగజేసి ఉన్నానని నేను అనుకోను. వ్యక్తిగతంగా, సభ్యులను ఆదరించడంలో ఏ లోటూ రానిచ్చానని అనుకోను. ఒకవేళ ఏదయినా లోటు ఉన్నా, అది అసంతృప్తిగా మారేంతగా ఉందని నేను అనుకోను.

"నేను ఒక బీద కుటుంబంలో జన్మించాను. నన్ను పెద్దచేసి, శిక్షణ నిచ్చిన ఆయనకూడా బీదవాడే. నాకు స్వతహాగా ఎక్కువ మాటాడే అలవాటు లేదు. అయినప్పటికి - నా విద్యార్థి దశలో కానీ, మునిసిపల్ జీవితంలో గానీ, తరువాత ప్రజారంగంలో కాలిడిన తర్వాతగాని, ఈ నా స్వభావంవల్ల ఏ మిత్రుడూ నా యెడల అనాదరణ భావం కలిగి ఉండలేదు."

ఈ విధంగా ఆయన రెండురోజులు ఉపన్యసించారు. పిదప క్రొత్త ప్రభుత్వం పక్షాన డాక్టర్ సుబ్బరాయన్‌గారు ఇలా అన్నారు:

"కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి మనసులో ఉన్నదల్లా చెన్నరాష్ట్ర శాసన సభ్యులు, తమ నాయకుని వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న భావమే. ఆ విధంగా వారు చేయజాలనప్పుడు అధిష్ఠాన వర్గంవారు ఏమి చేస్తారు? చెన్నరాష్ట్రానికి సంబంధించినంతమటుకు కలుగజేసుకోమన్నారు. అనగా,