పుట:Naajeevitayatrat021599mbp.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావంతో నా మంత్రివర్గ కార్యకలాపాలను ప్రారంభించాను. నాకు కలిగిన ఈ అభిప్రాయానికి ఆశాభంగం కలగలేదు. ప్రారంభించిన పది నెలలదాకా ప్రతి నెలా మా కార్యక్రమాలు సవ్యంగానే నడిచాయి. పరిపాలనానీతిలో ఏ భేదాభిప్రాయాలూ ఉండేవి కావు. ఒక్క మరకదుళ్ళ తిరస్కార విషయంలో ఏకీభావానికి రాలేకపోయాము. [1]


"అధ్యక్షా! ఈ మిల్లుబట్టల పరిశ్రమ ఇటుపైని విస్తృత పరచకూడదనే నీతికి సంబంధించి ఒక మంత్రి మిత్రుడు, మొట్టమొదట నాతో ఏకీభవించలేనని, వేరే ఒక చీటీమీద వ్రాసి పంపించాడు. అయితే, ఆ మిత్రుడుకూడా పార్టీ సమావేశంలో ఈ సమస్య చివరి చర్చలో ప్రభుత్వ నీతికి (పాలసీకి) వ్యతిరేకంగా చెప్పలేదు...

"మద్యపాన నిషేద విషయమై కొంత గట్టి ప్రతికూలత మొదట్లో వచ్చింది. కొందరు మిత్రులు ఇరవై నాలుగు జిల్లాలలోనూ ఒకే పర్యాయం మద్యనిషేధ చట్టం అమలు పరచవలె ననే అతివాదంలోకి వచ్చారు.. [2]

"జమీందారీ బిల్లు చర్చకు వచ్చింది. సెలెక్టు కమిటీకి ఆ బిల్లు పరిశీలించడానికి పంపవలసిందనే షరతుమీద దానిని ప్రవేశపెట్టడానికి అంతా సమ్మతించారు. అసలు నా మీద మిత్రులు చేసే పెద్ద ఆరోపణ నేను ఏలాగున అయినా పదవిని అంటిపెట్టుకొని ఉందామన్న దురాశ కలవాడి నన్నది. ఇది దురదృష్టకరము. అయితే, నాకు కొంతకాలంగా అదృష్టము, దుర

  1. గాంధీగారు ఈ మరకదుళ్ళ విషయంలో ప్రకాశంగారితో ఏకీభవించడమేగాకుండా, అవసరమైతే కేంద్రానికి పరిహారం చెల్లించి అయినా వాటిని తిరస్కరించాలని అభిప్రాయ పడ్డారు.
  2. ఎనిమిది జిల్లాలలో దానిని విస్తృత పరిచేసరికి ఈ ఆందోళన తగ్గింది.