పుట:Naajeevitayatrat021599mbp.pdf/756

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయింది. ఈ పద్ధతి తప్పు అని చెప్పడానికి నే నొక ఉదాహరణ చూపించాను.

పీనల్ కోడ్ ప్రకారం ప్రభుత్వపక్షాన కొన్ని ప్రాసిక్యూషన్లు (అనగా, మేజిస్ట్రేటు కోర్టులలో దోషులపై చర్యలు) తీసుకొనే ముందు, ప్రభుత్వంవారి శాంక్షను కావాలని ఆదేశింపబడి ఉన్నది. ప్రజాప్రభుత్వమనే సూత్రం అమలులోకి రాకపోయినా, 1914 లో, ప్రకాశంగారు ప్రాక్టీసు చేస్తున్న రోజులలో, వరదరాజులు నాయుడుగారనే వారిపైన రాజద్రోహం చేశారనే నేరం ఆరోపించబడి, మేజిస్ట్రేటు కోర్టులో చర్య ఆరంభమయింది.

విచారణ సమయంలో, ప్రభుత్వం - అనగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌వరకు ఫైలు వెళ్ళకుండానే, కార్యదర్శి సంతకంపైన చర్య ఆరంభమైనట్టు, కార్యదర్శి కోర్టులో దాఖలు చేసిన ఒక ఎఫిడవిట్టువల్ల బయట పడింది. ఈ విషయమై అప్పీలు వింటున్నప్పుడు హైకోర్టువారు ప్రభుత్వం అని చెప్పినచోట కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలరు ప్రమేయం లేకుండా ఏ ఆర్డరు జారీ చేయలేడనీ, అటువంటి ఆర్డరు చెల్లదనీ తీర్పు చెప్పారు.

అటువంటి పరిస్థితులలో, ప్రజా ప్రభుత్వ సూత్రం అమలు పరిచే మనదేశంలో మంత్రిదో, పార్లమెంటరీ సెక్రటరీదో అయినా అనుమతి లేకుండా - కార్యదర్శులు ఆర్డర్లు పాస్ చేయజాలరనీ, మంత్రులకు వ్యవధి లేనప్పుడు ఏ ఆర్డరు పాస్ చేయాలో, పార్లమెంటరీ సెక్రటరీల ఎరుకపైగాని, అనుమతిపైగాని కార్యదర్శులు వ్యవహరించాలనీ చెప్పిన అభిప్రాయంతో ప్రకాశంగారు సంపూర్ణంగా ఏకీభవించారు.

దానిపై, ఐ.సి.ఎస్. ఉద్యోగులందరూ కలిసి, పార్లమెంటరీ సెక్రటరీ అనే అతనికి ఫైలులో విషయం మాట అటుంచి, అసలు ఫైలు ముట్టుకొనడానికే హక్కు ఉండకూడదని వాదించారు. అసలు, కార్యదర్శులకు ఆర్డర్లు పాస్ చేసే హక్కు ఏ శాసన పూర్వకంగాను సంక్రమించలేదు. అయినా, రాజాజీ ప్రకాశంగారితో ఏకీభవించలేదు. కాని, 1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినపుడు, పార్ల