పుట:Naajeevitayatrat021599mbp.pdf/755

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక వందదాకా తెచ్చి, వాటిలో పదో పదిహేనో తప్ప తక్కినవి అంగీకరించక పోవడంవల్ల తనకా ఇబ్బంది కలుగుతున్నదనీ, ఢిల్లీలో అంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు రాలేదనీ, తా నీ ఉద్యోగం వదలుకుంటాననీ చెప్పడానికి ప్రకాశంగారి దగ్గరికి వచ్చాడు.

ఇంతట్లో సుందరంగారినుంచి ఆయనను డిస్మిస్ చేయాలని ఫైలు మీద ఫైలు వచ్చింది. ఏ ఫైలులోను రెండు, మూడు కాగితాల కంటె ఎక్కువ ఉండేవి కావు. వారే నేరారోపణ చేయడము, వారే తీర్పు చెప్పివేయడము - అంతమాత్రమే అందులోని విషయము.

ఈ వ్యవహారం క్రమబద్ధం కానందున, విషాద పరిణామాలకు దారి తీయకుండా ఆపివేయడానికి వీలైనది.

పార్లమెంటరీ సెక్రటరీలు

1937 లో మంత్రివర్గం ఏర్పడినపుడు, ఇంగ్లండులో వలెనే ఇక్కడా పార్లమెంటరీ సెక్రటరీల పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలనలో వీరికి భాగం కల్పించాలని ప్రకాశంగారి ఉద్దేశము. కానీ, పై ఉద్యోగులుగా ఉన్న ఐ.సి.ఎస్. వారు దీనికి సంపూర్ణంగా వ్యతిరేకులు. వారి అభిప్రాయ ప్రకారంగా మంత్రులు ఒక రోజు ఉండి, మరొక రోజు వెళ్ళేవారు గనుకా, తాము ముప్పైఏండ్ల బట్టి ఉద్యోగంలో ఉండడంవల్ల ప్రభుత్వపు పోకడలు పూర్వాపరాలు తెలియగలవు గనుకా, మంత్రులు వ్యవధిలేక చూడలెని కాగితాలను తామే చూసి, ప్రభుత్వమే ఆర్డరు జారీ చేసినట్టు చేసే హక్కు తమకు ఉండాలి.

ఈ అభిప్రాయ ప్రకారంగా నూటికి 75 ఫైళ్ళకుపైగా మంత్రులకు సంబంధం లేకుండా ఆర్డర్లు జారీ చేసే పద్ధతిలో పరిపాలన సాగుతూండేది. ప్రజారాజ్య సూత్రానికి ఎన్నికైన మంత్రులు ప్రభుత్వ పక్షాన నిర్ణయం తీసుకొని, ఆర్డర్లు జారీ చేస్తున్నారని ప్రజలు అనుకొనేవారు. వారి అభిప్రాయానికి ఈ అలవాటు వ్యతిరేకమైనది ఇటువంటి అలవాటు మన సచివాలయాలకు ఇంగ్లండునుంచి దిగుమతి