పుట:Naajeevitayatrat021599mbp.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరేనని మూడు స్థానాలు ఇవ్వబోయేసరికి, నాలుగు కావాలని కబురు చేశారు, నాలుగు ఇవ్వకపోతే కామరాజ నాడారుగారితో చేయి కలుపుతామన్నారు. ప్రకాశంగారు - ఇటువంటి బేరంలోకి దిగి ముఖ్య మంత్రి పదవి నిలబెట్టుకోవడం ఆత్మగౌరవానికి భంగకరమన్నమాట అలా ఉంచి, ప్రజారాజ్య తంత్ర ప్రక్రియకు అపారమైన నష్టం వస్తుందని అందుకు అంగీకరించక, మంత్రివర్గ పతనమే శ్రేయస్కరమని - దానినే అంగీకరించారు.

వృత్తి విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చుకొనే సమస్య

ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉన్న రోజులలో, వైద్య, ఇంజనీరింగు కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశం పెద్ద సమస్య అయింది. ఉద్యోగాలలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించినట్టే, ఈ రెండు రకాల వృత్తి విద్యల కాలేజీలలోను బ్రాహ్మణులను వారి జనాభా నిష్పత్తికి మించి చేర్చుకోరాదని ఒక ఏర్పాటు ప్రకాశంగారు మంత్రివర్గం అధికారంలోకి వచ్చేనాటికి అమలులో ఉంది.

మంత్రివర్గ పాలన ప్రారంభమయిన మరి రెండు నెలలకు కాలేజీలు తెరవబడతాయి. కాబట్టి, వెంటనే ఈ సమస్య పైకి వచ్చింది. విద్యలో ముఖ్యంగా సాంకేతిక విద్యలో కులమువారీ నిష్పత్తులపైన విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు ప్రభుత్వం పరిమితంచేస్తే, ఆ నిష్పత్తులను అడిగేవారికే రానురాను నష్ట కలుగుతుందనిగాని, దేశంలో గల మేధాశక్తి భస్మం అవుతున్నదని గాని, ఈ నిష్పత్తి కోరేవారు గ్రహించ లేదు. విద్యార్థుల మేధాశక్తికి వారు పరీక్షలలో తెచ్చుకున్న మార్కులు ఒక విధమైన ప్రమాణము. ఆ ప్రమాణం నూటికి నూరుపాళ్ళు సరి అయిన ఫలితం ఇచ్చినా, ఇవ్వకున్నా, దానికి పర్యాయంగా వేరే ప్రమాణం దొరకలేదు. అందుచేత, ప్రకాశంగారు ఈ కాలేజీలలో ఒక పద్ధతి చెప్పారు. నూటికి యాభై సీట్లు మొట్టమొదట విద్యార్థుల మార్కుల ననుసరించి ఇవ్వవలసిందనీ, తక్కిన యాభై సీట్లను అప్పుడు అమ