పుట:Naajeevitayatrat021599mbp.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లులో ఉన్న కులమువారీ నిష్పత్తి ప్రకారము ఇవ్వవలసిందనీ కేబినెట్ ముందు తీర్మానం ప్రతిపాదించారు. అయితే, కేబినెట్‌లో మంత్రులు నూటికి ఇరవైచోట్లే మార్కులనుబట్టి యివ్వవలసిందనీ, మిగిలినచోట్లు కులమువారీ నిష్పత్తి ప్రకారము ఇదివరకు లాగానే ఇవ్వవలసిందనీ తీర్మానించారు.

న్యాయ, కార్యనిర్వాహక శాఖల విభజన

ప్రభుత్వాలు, తమ పలుకుబడిని నిలబెట్టుకొనేందుకు, లా అండ్ ఆర్డర్‌తో సంబంధించిన అనేక విషయాలను, న్యాయస్థానాలకు వదలక, తమ చెప్పు చేతలలో ఉన్న మాజిస్ట్రేట్ల చేతులలో ఉంచడం మామూలు. అందుచేత, కాంగ్రెసువారు దాదాపు నలభై, యాభైఏండ్ల నుంచి ఎగ్జిక్యూటివ్‌నుంచి జ్యుడిషియరీని (ప్రభుత్వ కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయశాఖను) సంపూర్ణంగా విడదీయవలసిందని కోరుతూ వచ్చారు.

రాజాజీ మంత్రివర్గంలో 20-3-38 న ఈ ప్రశ్న ఉదయించినపుడు, "ఈ సమస్య పరిష్కరించడానికి ఆర్థిక సంబంధమైనవీ, పరిపాలనా సంబంధమైనవీ అయిన అనేకమైన క్రొత్త సమస్యలు ఉద్బవిస్తాయి గనుక, వీటిని విడదీయాలని అసెంబ్లీలో ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరిస్తున్నది" అని కాబినెట్ తీర్మానం వ్రాయించారు.

కానీ, ప్రకాశంగారు 1946 లో ముఖ్యమంత్రి కాగానే, భాష్యంతో చెప్పి, కుట్టి కృష్ణమేనోన్ అనే న్యాయవాది అధ్యక్షతను ఏర్పరచిన ఉపసంఘం సలహా ప్రకారం కాంగ్రెసువారి చిరకాల వాంఛను తీర్చి, ఆ విభజనను ఏమీ ఆర్భాటం లేకుండా అమలులోకి తెచ్చారు.

ప్రకాశంగారి దృఢ చిత్తత

పార్టీలో ఉన్న తమ ఎదురు పక్షంవారు చేస్తున్న ప్రచారమెంత ముమ్మరంగా ఉన్నా, ప్రకాశంగారు కొంత సమత, సహన