పుట:Naajeevitayatrat021599mbp.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని బదులిచ్చారు. ప్రకాశంగారు మిల్లుదారము ఖాదీ కేంద్రాలలోకి రాగూడదని చేసిన నిషేధము, చెన్నరాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మర కుదుళ్ళను తిరస్కరించడం అనే రెండు పనులను గాంధీగారు సంపూర్ణంగా బలపరుస్తూ 'హరిజన్‌' పత్రిక కని ఒక వ్యాసం వ్రాశారు. కానీ, అది అచ్చయ్యే సమయంలో, ఆ విధంగా ప్రకాశంగారిని పొగడడం తనకు మంచిది కాదని రాజాజీ చెప్పుకోవడం వల్ల, గాంధీగారు దాన్ని ప్రకటించడం మానుకున్నారని అక్కడున్నవారు, అది తెలిసినవారు చెప్పారు. అయితే ప్రకాశంగారికి మాత్రం ఆయనను బలపరుస్తూ గాంధీగారు ఉత్తరం వ్రాసి పంపించారు. దాన్ని ఏ కారణంచేతో ప్రకాశంగారు పార్టీ మీటింగులో చదవలేదు. కాని, శాసన మండలిలో బడ్జెట్టుకు జవాబిస్తూ, గాంధీగారి ఉత్తరం యావత్తూ చదివి వినిపించి, తాను అధిష్ఠానవర్గానికి వ్యతిరేకంగా తన త్రోవను తానొక్కడే పోతున్నాడన్న వాదం ఆధార రహితమని చెప్పారు.

ప్రకాశంగారి ఆత్మగౌరవం

అయితే ఏమి? పార్టీలో ఎదురు పక్షం వారంతా అప్పటికే రాజకీయంగా తమకు ప్రకాశంగారిపై గల వైముఖ్యంతోపాటు, గ్రామ స్వరాజ్య ఫిర్కా అభ్యుదయ, ఉత్పత్తి క్రయవిక్రయ సహకార సంఘ ఉద్యమములు, ప్రత్యేక ఖాదీ ఉద్యమము మొదలైన వాటివల్ల వ్యక్తిగతంగా నష్టపడే మధ్యవర్తులకు సహాయదారులుగా ఉన్న శాసన సభ్యుల బలవత్తరమైన వైమనస్యతా కలిసి, ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉండగూడదన్న నిశ్చయానికి వచ్చేశారు.

చివరి రోజులలో రాజాజీ వర్గంవారికి రెండు మంత్రి పదవులు ఇచ్చి మంత్రివర్గాన్ని విస్తృత పరిస్తే అది నిలిచి ఉంటుందని, మొదట వారికీ మంత్రివర్గంలో స్థాన మిచ్చే ఉద్దేశం ఉండినందువల్ల, ఈ పరిస్థితులలో వారు మంత్రివర్గంలో చేరడానికి ఒప్పుకున్నపుడు తప్పకుండా ఆ రెండు స్థానాలు ఇస్తామన్నారు.

పేర్లు అడిగేసరికి, మూడు స్థానాలు కావాలన్నారు. సంఖ్యా బలాన్నిబట్టి చూస్తే వారికి మూడు స్థానాలు చాలా హెచ్చు. అయినా