పుట:Naajeevitayatrat021599mbp.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికంగా ఉత్పత్తిచేయడానికి, బట్టల మిల్లులను రాష్ట్రంలో అభివృద్ధిపరచడానికీ కేంద్రప్రభుత్వంవారు కొన్నివేల మరకదుళ్ళను (Spindles) కేటాయించగా, ఆ కార్యక్రమం సాగించడానికి అప్పటి గవర్నరు ప్రభుత్వం అంగీకరించింది.

ఆ విధంగా మిల్లులను విస్తృతపరచడం - ఖద్దరు ఉద్యమానికి విరుద్ద కార్యక్రమం గనుక, మరకదుళ్ళు అక్కరలేదని ప్రకాశంగారు పైకి వ్రాసేశారు. కాబినెట్‌లో ముగ్గురు, నలుగురు మంత్రులు ప్రత్యేకించి ఈ విషయంలో ప్రకాశంగారికి వ్యతిరేకు లయ్యారు.

అంతకు ముందే, ప్రకాశంగారు పట్నంలో ఉన్న మోటార్ బస్సులను జాతీయం చేసేశారు. అందుచేత, పై స్కీములవల్ల రాజకీయంగా ఉన్న ఒడిదుడుకులతోపాటు వర్తకులు, రైసు మిల్లులవారు, బట్టల మిల్లుల యజమానులు, మోటారు బస్సుల యజమానులు - మంత్రివర్గానికి వ్యతిరేకమై పోయారు.

గ్రామస్థుల స్వయంపోషకత్వం, బస్సులను జాతీయం చేయడం, మరకదుళ్ళ తిరస్కారం, ఇవి అన్నీ కలిసి - ప్రకాశంగారికి ఇదివరలోనే ఉన్న గాంధీగారి విముఖత, రాజకీయంగా పార్టీలో ఎదురు పక్షాలవారి వైమనస్యానికి తోడయి, ఆయనను ఒక్కపాటుగా ఎదుర్కోవడం మొదలు పెట్టాయి.

శాసన సభ ప్రథమ సమావేశము

1946 మే నెల 25 న అధ్యక్షుని ఎన్నికయిన తర్వాత, శాసన సభ ప్రథమ సమావేశం మే 27 న జరిగింది.

నాటి కార్యక్రమంలో మొదటి విషయం - మంత్రుల జీవితాలను హెచ్చించడానికి ప్రతిపాదింపబడిన బిల్లు. సహజంగా సభ్యుల వేతనాలు హెచ్చించే విధి కూడా అందులో ఉంది.

ఇటువంటి బిల్లు వచ్చినపుడు సభ్యులు వ్యతిరేక ప్రకటన చేయడం సంప్రదాయంగా వస్తున్న లాంఛనము. బిల్లు పాస్ అయిన తర్వాత ఎదురు పక్షంవారు కూడా దాని లాభం పొందుతారు గదా! అయినప్పటికి అందులో కొందరు, వారి పార్టీ సూత్ర ప్రకారంగా గట్టిగా ఎదిరి