పుట:Naajeevitayatrat021599mbp.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండానికే గాంధీగారు, ప్రకాశంగారు స్వయంపోషక గ్రామస్వరాజ్య భావాన్ని పెంపొందించడానికి యత్నించారు. కాని, ఈ దేశం 'జాతకం' ఏలాగున సాగుతుందో వారు గ్రహించలేకపోయారు. దాని ఫలితమే, ఇపుడు దేశంలో రాజకీయరంగంలో అనేక సమరాలకు మూలమయింది.

ఫిర్కా అభ్యుదయ ప్రణాళిక

గ్రామాభ్యుదయం కొంతవరకు ప్రక్రియాత్మకంగా జరిగితే తప్ప సార్వజనికమైన అంగీకారం పొందడం కష్టమని, అందుకు కావలసిన ధనము ఏర్పాటుచేసే సౌకర్యంకోసం జిల్లాకు రెండు ఫిర్కాల చొప్పున ఈ స్కీములో చేర్చబడినవి. ఫిర్కా అంతటినీ ఒక ఖండం క్రింద స్వయంపోషకంగా చేయడానికీ, సాంస్కృతికంగా అభ్యుదయం పొందేటట్టు చేయడానికీ - ఈ స్కీములను ఎంతో అభిమానంతో, ఉత్సాహంతో - ప్రకాశంగారి లక్ష్యములకు అనుగుణంగా పనిచేయ గలిగిన వారిని, మిగిలిన గవర్నమెంటు ఉద్యోగాల రాంకులతో సంబంధించ కుండా, ఫిర్కా డెవలప్‌మెంట్ ఉద్యోగులుగా నియమించారు. ఇందులో చాలామంది స్వాతంత్ర్య సమర యోధులు.

రాను రాను, స్వయంపోషక సూత్రాన్ని మాత్రం వదిలిపెట్టి, కొన్ని కొన్ని ఫిర్కాలు ఒక బ్లాకుగా మార్పుచెంది, ఆ బ్లాకు లిప్పుడు సమితులుగా పరిణమించాయి. స్వయంపోషక సూత్రం మరుగు పడడమే గాక, గ్రామ స్వరాజ్యంతో సంబంధించని రాజకీయ సోపానాలుగా అవి ప్రస్తుతమున్న రూపాన్ని పొందాయి.

ఖాదీ అభ్యుదయ ఉద్యమము

రాష్ట్రంలో ఖద్దరు ఉత్పత్తిచేసే కొన్ని కేంద్రాలలో ప్రత్యేకంగా, హెచ్చుగా ఖద్దరు వ్యాప్తి కావడానికి ఒక స్కీమును ప్రకాశంగారు ప్రతిపాదించారు. ఈ స్కీము క్రింద ప్రత్యేకింపబడిన కేంద్రాలలో మిల్లుబట్ట వంతు, సంపూర్ణంగా ఖద్దరే ఉత్పత్తి అయి వినియోగమయేటట్టు ఏర్పాటు చేయబడింది.

ఇందుకు అనుబందంగా మరొక పనికూడా చేయవలసి వచ్చింది. ప్రకాశంగారి మంత్రివర్గం ఏర్పాటు కావడానికి ముందే - మిల్లుబట్ట