పుట:Naajeevitayatrat021599mbp.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక సభ్యుడు ఈ విషయం ప్రస్తావిస్తూ, మన దేశాన్ని ఈ విధంగా హేళన చేశాడు:

"ఇండియా దేశము: స్వరాజ్యం కావాలని కోరుకున్న ఈ సమయంలో - చెన్నరాష్ట్రంలోని కాంగ్రెసువారు తమ నాయకుని ఎన్నుకోలేకుండా నాయకత్వవిషయమై దెబ్బలాడు కుంటున్నారనీ, సంవిధానాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో లేకుండా ఉన్నారనీ మన ప్రభుత్వంవారు ఇక్కడ చెప్పుతున్నారు."

ఈ మాటలు తెలిసి భారతీయులు సిగ్గుపడ్డారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు మొదట ఇచ్చిన తంతితో సంతృప్తిపడలేదు. ఇచ్చిన తంతి అర్థం స్పష్టంగా లేదని సభాధ్యక్షులయిన గిరిగారు, స్పష్టీకరించమని కోరగా, వారు స్పష్టీకరిస్తూ, మరొక వాక్యం కలిపారు - "మీరు రాజగోపాలాచారిని మీ నాయకునిగా ఎన్నుకున్నట్టయితే, మంత్రివర్గంలో తనకు కావలసిన వారిని మంత్రులుగా తీసుకుని, తక్కినవారిని వదలిపెట్టే స్వేచ్ఛ ఆయనకుంటుంది" అని.

ఏప్రిల్ 17 న దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు ఒక పత్రికా ప్రకటనలో --

"శాసన సభలో తమ నాయకుని ఎన్నుకునే అధికారం అధిష్ఠానవర్గంవారు శాసన సభ్యులకే వదిలి పెట్టేశారు. పూర్వాపరములైన పరిస్థితులను ఆలోచించిన పిమ్మట మనము ప్రకాశంగారినే నాయకునిగా ఎన్నుకొనడం మంచిది. ప్రజానురాగం బహుళంగా పొందిన నాయకుడాయన," అని ఆయన ఉద్ఘాటించారు.

శాసన సభ్యుల నిర్ణయం

ఏప్రిల్ 18 న తిరిగి కాంగ్రెసు శాసన సభ్యులు సమావేశమై రెండుగంట లాలోచించి, అధిష్ఠాన వర్గంవారి సలహా అంగీకరించడమా, వద్దా అన్న ప్రశ్నను వోటుకు పెట్టగా - నిరాకరించడానికి 148 వోట్లు, అంగీకరించడానికి 38 వోట్లు వచ్చినవి. అనగా, రాజగోపాలాచారి