పుట:Naajeevitayatrat021599mbp.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజారాజ్యపు అధిష్ఠాన దేవత ఒక్క చిరునవ్వు నవ్వింది.

శాసన సభ్యుల సమావేశము

ఏప్రిల్ 18 న తిరిగి శాసన సభ్యులందరు గిరిగారి అధ్యక్షతన హిందీ ప్రచార సభా మందిరంలో సమావేశం కావడం జరిగింది. అంతలో కాంగ్రెసు అధ్యక్షులయిన ఆజాద్‌గారినుంచి ఒక తంతి వచ్చింది. అందులో ఉన్న విషయాలివి:

"18 వ తేదీన జరిగే పార్టీసభకు వచ్చే శాసన సభ్యులకు ఈ సందేశం అందజేయవలసింది -

"పరిస్థితులన్నీ చక్కగా ఆలోచించి, సి. రాజగోపాలాచారిగారిని మీ నాయకునిగా ఎన్నుకోవలసిందని ఇందు మూలంగా నేను సలహా ఇస్తున్నాను. ఈ సలహా ఇవ్వడంలో మహాత్మాగాంధీగారు, వల్లభాయి పటేలుగారు నాతో ఏకీభవిస్తున్నారు. ఈ సలహా మీ నెత్తిపైన రుద్దుతున్నామని భావించవద్దు. మీలో బహుసంఖ్యాకు లయిన సభ్యులకూ మా సలహా పాటించడానికి ఇష్టం లేకపోతే, అట్టివారు తోచినవిధాన తీర్మానించుకోవచ్చు. అయితే, ఆ భాధ్యత వారిదే అయిఉంటుంది."

అంతకు ఏడేండ్ల ముందు గాంధిగారికి ఇష్టంలేకుండా సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడయినప్పుడు - ఈ విధంగానే బోసు తన స్వంత బాధ్యతపైనే కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని చెప్పడమూ, ఆయన అధ్యక్షపదవి వదిలిపెట్టడమూ జరిగినవి. ఈ విషయంలో ప్రకాశంగారు, నాడారు మొదలైనవారికి ఈ బాధ్యత తగిలింది తర్వాత - ప్రకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు, భక్తవత్సలంగారు గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళారు. తెలుగు జిల్లాలలో - ఆ బండి ఆగిన ప్రతిస్టేషనువద్ద వేలకొద్ది ప్రజలు గుమిగూడి ప్రకాశంగారికి, నాడారుగారికి జయజయ ధ్వానాలు పలికారు.

చెన్నరాష్ట్రంలో శాసన సభా నాయకత్వాన్ని గూర్చి ఉయ్యాలలు అటూ ఇటూ ఊపుతూంటే, ఇంగ్లండులో హవుస్ ఆఫ్ కామన్స్‌లో