పుట:Naajeevitayatrat021599mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వకీలు. పైగా, చెట్టుకింద వకీళ్ళలో ఒకడు! కాని ప్రయోజకుడుగా పేరుపడ్డాడు. అతను వకాల్తనామా ఫీజు ఎనిమిదణాలూ కూడా చేతిది పెట్టుకుని వకాల్తా దాఖలు చేశాడు. వెంకటరత్నం నాయుడుగారు తన తమ్ముడి విషయంలో అంతగా శ్రద్ధ వహించక పోయినా, అతని కులస్థుడైన సామినేని బుచ్చిఅబ్బాయి నాయుడు, - (రిటైర్డు సబ్‌జడ్జి) తాయి సూర్యప్రకాశరావు - (తహసీల్దారు) గార్లు మమ్మల్ని పిలిచి "ఏమిటిరా అబ్బాయిలు! ఇట్లాంటి కేసు వచ్చిం దేమిటి మీ మీద?" అని అడిగారు. మేము వున్నది వున్నట్లుగా చెప్పాము; ఆ సూర్యప్రకాశరావునాయుడుగారు నన్ను పిలిచి, "మిమ్మల్ని వాళ్ళు ఏ వేళ కొట్టారు?" అని అడిగాడు. "రాత్రి" అని చెప్పాను. "వాళ్ళు రాత్రి కొడితే మీరు పగలెందుకు కొట్టారు!" అని సంయుక్తికంగా అడిగి మామీద నేరం ఆరోపించాడు! కేసు నడిచింది.

మేమంతా, మమ్మల్ని కాకినాడలో కొడితే వాళ్ళమీద సాక్ష్యానికి ఎవ్వరూ రాలేదు గదా! ఇప్పుడు మేము వాళ్ళని కొడితే ఈ ఊళ్ళోవాళ్లు సాక్ష్యానికి ఎల్లా వస్తారో చూదా మనే ధీమాతో వున్నాము! పోలీసులు ఘరానాగా దుగ్గిరాల కాశీవిశ్వనాథం, కొరళ్ళు సుబ్బారాయుడుగార్ల నిద్దరినీ సాక్ష్యం వేశారు. సుబ్బారాయుడికి "కాకినాడనించి సాక్ష్యానికి వస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రావాలి అనీ ధవళేశ్వరం రాజమహేంద్రవరాల మధ్యన మాట దక్క" దనీ ఆకాశరామన్న ఉత్తరం వెళ్ళి పోయింది. ఇంక నేనూ చలపతిరావూ కలిసి ఒకనాడు రాత్రి 12 గంటలకి దుగ్గిరాల కాశీవిశ్వనాథం ఇంటికివెళ్లాము. తలుపు కొట్టేసరికి అతను ఉలికిపడి లేచి వచ్చాడు. మేము కాస్త తమాయించి, మామీద సాక్ష్యం చెప్పడం సబబు కాదని చెప్పాము. చలపతిరావు కొంచెం మొరటు తనంగా "మా మీద సాక్ష్యం చెప్పి, మా కే ఆరునెలలో శిక్ష వేయించినా, తిరిగి వచ్చిన తరవాత నీ ప్రాణాలు దక్కవు సుమా!" అని బెదిరించాడు.

ఏ మైతేనేమి, తీరా సాక్ష్యానికి వచ్చేసరికి దుగ్గిరాల కాశీవిశ్వనాథం "దెబ్బలాట జరుగుతూ వుంటే చూచాననీ, అక్కడ దెబ్బలు