పుట:Naajeevitayatrat021599mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగులుతూ వుంటే తనకి గీర ఎత్తిందనీ, ఇంక అక్కడ ఆగలేక వెళ్ళిపోయాననీ, ఎవరు కొట్టారో చెప్పడం అసాధ్యం," అనీ చెప్పాడు. కొరళ్ళ సుబ్బారాయుడు సాక్ష్యానికి రానేలేదు. అతనికోసం కేసు రెండు మూడు వాయిదాలు వేశారు; గాని చివరికి పోలీసులు అతని సాక్ష్యానికి నీళ్ళు వదులుకున్నారు. చివరికి కేసు విచారించిన మేజిస్ట్రీటు మేము నేరం చేసివుండడానికి అవకాశా లున్నాయనీ, కాని, శిక్షించడానికి తగిన సాక్ష్యం లేదనీ వ్రాసి కేసు కొట్టేశాడు.

50 ఏళ్ళయిన తరవాత ఇప్పుడు ఆ విషయం తలచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుండి. ఆనాడే ఏ ఆరునెలలో శిక్షవేసి జైలుకి పంపించి వుంటే, ఈ జీవితం ఏ పంథాపట్టేదో, ఏ మైపోయేదో ఆ పరమేశ్వరుడికే ఎరుక! కాలు అణుమాత్రం జారితే అథ:పాతాళంలోకి పడిపోయే స్థితిలోనించి బయటపడ్డాము. ఎప్పటికప్పుడు కొండయ్య చచ్చిపోతాడనీ, కేసు కూనీ కేసవుతుందనీ భయంకరమైన వార్తలు వస్తూవుండేవి. కాని, ప్రారబ్ధం ఎల్లా నడిపిస్తోందో ఎవరు చెప్పగలరు? కాకినాడలో అక్రమంగా కొట్టినప్పుడు మేము బ్రతకడమూ దైవికమే; మేము మళ్ళీ కొండయ్యని కొట్టినప్పుడు అతను బ్రతకడమూ దైవికమే! ఈ సంఘటనలన్నీ దైవికంగా ఈ జీవితపు భవిష్యత్తు ఈ విధంగా నిర్ణయించాయి.

ఈ గాథ సందర్భంలో ఆనాడు నా మనోభావాల పోకడలు కొంచెం వ్రాస్తాను. పాఠకులు వాటిని గురించి, ఈనాటి శాంతిసూత్రాలతో ఆలోచిస్తే లాభంలేదు. నేను ఎన్నో సాహసకార్యాల్లోపడి, ప్రమాదావస్థలు తప్పించుకున్నా నంటే దానికి దైవికమైన బలం అల్లా వుండగా, నేను చేసిన పనిలో ఒకన్యాయం వున్నదనే విశ్వాసం కూడా నాకు తోడ్పడిందనుకుంటాను. కొండయ్యని మెయిన్‌రోడ్డుమీద వుతికే సాహసం వచ్చిందంటే, దానివెనకాల నా మనస్సు ఎంతగా ఆందోళన పడిందో గమనించాలి. కాకినాడలో అర్ధరాత్రివేళ మమ్మల్ని అక్రమంగా కొట్టారు; వాళ్ళమీద న్యాయంగా కేసు పెడితే న్యాయపక్షాన్ని సాక్ష్యం ఇచ్చేవాళ్లే లేకపోయారు! చివరికి వాళ్ళకి కాస్త బుద్ధిచెప్పే