పుట:Naajeevitayatrat021599mbp.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సారి. కాని, నా కిక్కడ చాలా మంచి అనుభవం కలిగింది. లోకజ్ఞానం వచ్చింది. పెద్దవారికి గల చిన్న మనసులను, చిన్నవారికి గల పెద్ద మనసులను ఇక్కడ చూడగలిగాను."

అంతటిలో, రాజాజీ విడుదల అయే సమయం ఆసన్నమయింది. ఆయన పెద్దవారు గనుక, ఆయన కిచ్చే టీ పార్టీల సంఖ్యకూడా పెరిగింది. అలా ఒక తేనీటి విందులో ఆయన ఉపదేశ వాక్యాల మధ్య "హిందూ ముస్లిమ్ సమస్య అన్నది నా చేతులలో వదలి పెట్టినట్లయితే, ఐదు నిమిషాలలో పరిష్కారం చేస్తాను" అన్నారు. ఈ మాటలు వినేసరికి, మాలో చాలా మందికి పరిష్కారంపై ఆశ, పరిష్కారం ఇంత సులభమా అన్న ఆశ్చర్యమూ కలిగినవి. నేను "ఆ రహస్య మేదో మాకు చెబితే, మీకు మేము సహాయం చేస్తాము గదా, చెప్పండి" అన్నాను.

దాని కాయన, "నువ్విప్పు డిలా అంటావు. రేపు గాంధీగారు వస్తే 'గాంధీగారు, గాంధీగా'రని ఆయన వెంట పడతావు. నీతో చెప్పి ఏమి లాభము?" అన్నారు.

ఉన్నత స్థాయిలో - ఆయనకూ, గాంధీగారికీ మౌలికంగా ఉన్న విభేదాలు తెలిసిన వారికి మాత్రం ఈ మాటలోని రహస్యం కొంచెం అర్థమయింది, మిగిలిన వారి కది రాజాజీ సహజ చమత్కార వాక్య సరళిగా మాత్రమే కనిపించింది.

చాలామందికి శిక్ష తొమ్మిది నెలల పరిమితి లోపలే ఉండడంచేత ప్రతిరోజూ ముగ్గురో, నలుగురో 1941 సెప్టంబరునుంచి విడుదల అయిపోతూ ఉండేవారు. ఏడాది శిక్షగలవారు ముప్పై నలభై మందికి ఎక్కువ లేరు. పద్దెనిమిది నెలల శిక్ష పొందిన వాడిని నేనొక్కడినే. ఇంతలో ప్రకాశంగారు విడుదలయ్యారు. (కొంత స్పెషల్ రెమిషన్ కారణంగా రాజాజీ, ప్రకాశంగారూ ఒకే రోజు విడుదలయి, తిరుచినాపల్లిలో మాజీ మంత్రి అయిన డాక్టర్ రాజన్ గారికి అతిథులైనారు) వీడ్కొలుపులకు, విందులకు ప్రకాశంగారు పూర్తిగా విముఖులు. అందుచేత ఆయన జైలునుంచి వెళుతున్న రోజున