పుట:Naajeevitayatrat021599mbp.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్తం మడుగులో పడిపోయేంత వరకు లాటీలతో కొట్టించిన "డప్పుల సుబ్బారావు" అనే పోలీస్ ఉద్యోగికి, ఆంధ్ర కాంగ్రెసువా రందరూ అడ్డుతున్నా వినక - ఒక గౌరవస్థానం. ఇంగ్లండు ప్రయాణం రాజాజీ కల్పించారు రాజాజీ మంత్రివర్గంలోని డాక్టర్ సుబ్బరాయన్ అనే మంత్రి - కోయంబత్తూరులో ఉపన్యసిస్తున్న సమయంలో, ప్రేక్షక బాహుళ్యం హెచ్చయి, ఒకచోట అల్లరిగా ఉండగా పోలీసు జవానులు లాటీలతో ప్రజలను త్రోయడాన్ని వేదికనుంచి చూచిన ఆ మంత్రి కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పాటైన కాలంలోకూడా పోలీసు లా విధంగా ప్రవర్తించ రాదని వారిని గట్టిగా మందలించారు. పోలీసు శాఖ ఆ రోజులలో రాజాజీ చేతులలో ఉండేది. తెల్లవారేసరికి సుబ్బరాయన్ గారు చెన్నపట్నం తిరిగి వచ్చారు. పత్రికలలో ఆయన ఉపన్యాసం అంతా వేయలేదుగాని, పోలీసువారిని ఖండించిన భాగం మాత్రం పెద్ద అక్షరాలతో వేయడం జరిగింది. 8 గంటలవేళ సుబ్బరాయన్‌గారు ముఖక్షవరం చేసుకుంటుండగా రాజాజీనుంచి, ఆయనకు పోన్ వచ్చింది. రాజాజీ సుబ్బరాయన్ గారికి పరమ గురువు వంటివారు. రాజాజీ సుబ్బరాయన్‌గారితో ఫోనులో, "ఏమయ్యా! సుబ్బరాయన్! కోయంబత్తూరు మీటింగులో నిన్న సాయంత్రం పోలీసుల విషయమై నువ్వేదో చెప్పినట్లు పేపర్లో పడింది. ఏమిటిది?" అని అడగ్గా, సుబ్బరాయన్‌గారు, "అవునండి! బ్రిటిషు హయాంలో మాదిరిగానే పోలీసులు ప్రేక్షకులను లాటీలతో కొట్టడంచూచి మందలించాను. అది పేపర్లో పడవలసినంత పెద్ద విషయ మేమీ కాదు!" అన్నారు.

అది విని రాజాజీ, "సుబ్బరాయన్! నీవు ఎవరిని మందలించావో తెలుసా? పోలీసు జవానులను కాదు - పోలీసు శాఖామంత్రి అయిన రాజగోపాలాచారిని. విన్నావా?" అన్నారు.

"ఎంతమాట - ఎంతమాట!" అన్నారు సుబ్బరాయన్‌గారు. తర్వాత రాజాజీ, "పత్రికల రిపోర్టు సరి అయింది కా" దని స్టేట్ మెంటు ఇమ్మంటే, తాను కళ్ళతో చూసిందే చెప్పినట్లు సుబ్బరాయన్ అన్నారు. దానిపైన రాజాజీ, తానొక పత్రికా విలేఖరిని పంపు