పుట:Naajeevitayatrat021599mbp.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తున్నట్టు అతడు తెచ్చే సవరణ కాగితం మీద సుబ్బరాయన్ సంతకం చేసి పంపవలసిందన్నట్టు ఆదేశించారు.

ఆసమయంలో నేను ఏదో పనిమీద వెళ్లి సుబ్బరాయన్ గారిదగ్గర ఉండడం జరిగింది ఈ విషయాన్ని గురించి మేము ఆశ్చర్య చకితులమయి మాట్లాడుకుంటుండగానే, రాజాజీ పంపిన పత్రికావిలేఖరి వచ్చి, సవరణ కాగితాన్ని సుబ్బరాయన్ గారికిచ్చాడు."పోలీసులను నేను కోయంబత్తూరు మీటింగులో గట్టిగా మందలించా నన్న వార్తా ప్రకటనలో నిజంలేదు," అని వున్న కాగితంపైన సుబ్బరాయన్ గారు సంతకం పెట్టారు. అదిచూసి నేను నవ్వగా, "నువ్వు నవ్వితే నవ్వవయ్యా! మా గురువును నేను కాదన లే"నన్నారు సుబ్బరాయన్ గారు మందహాసం చేస్తూ.

రాజాజీ దృష్టి ఇటువంటిది. ప్రకాశం గారి దృష్టి దీనికి సరిగ్గా భిన్నమైనది.ఒకమారు పశ్చిమగోదావరి జిల్లా ఒక ముఖ్యవ్యక్తిని హత్య చేయడం జరిగింది.ఆ మరునాడు ఉదయం మెయిలులో నేను, ప్రకాశంగారు చెన్నపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతూండగా, కొందరు వచ్చి ఆ హత్య సంగతి చెప్పి, దాన్ని ఒక పెద్ద పోలీస్ ఉద్యోగి కప్పివేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పగానే, ఆయన వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కు తంతి యిచ్చి, చెన్నపట్నం వెళ్లిన తరువాత ఆ హత్యా పరిశోధననుంచి ఆ అధికారిని తప్పించి, మరొక పెద్ద ఉద్యోగికి అప్పజెప్పారు. ఇది ప్రకాశం గారి పద్ధతి.

మరికొన్ని విశేషాలు


పంచాయితీ, గ్రామ స్వరాజ్యం అన్న విషయాలపైన ప్రకాశం గారికి ఆసక్తి చాలా హెచ్చు. వారికి చాలా అధికారాలు ఇవ్వవలసిందని కూడా ఒక బిల్లు స్వయంగా తయారు చేశారు. నేను కూడా ఆ సందర్భంలో అలా ప్రచారం చేశాను.అయితే పంచాయితీలు తగాదాలకు రంగస్థలాలని, అవి చదువకొనని వారిచేతిలో ఉంటాయి గనుక, వారికి హెచ్చు అధికారాలు ఇవ్వగూడదనీ సచివాలయంలో