పుట:Naajeevitayatrat021599mbp.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నివేదిక. వెంకటరావుగారి బిల్లులో, ప్రక్కనున్న ఇప్పటి రైత్వారీ భూమిరేటు ఏదో అ రేటు ప్రకారం సిస్తులు ఏర్పాటు కావాలని ప్రతిపాదింప బడింది. చెన్నరాష్ట్రపు దక్షిణ భాగంలోని కొందరు జమీందారులు శాస్త్రీయముగా నడుచుకొన్న కారణంచేత పెర్మనెంట్ సెటిల్మెంటునాటి రేట్లే ఆ నాడు అమలులో ఉండడముచేత ప్రక్కభూముల రైత్వారీ రేట్ల సూత్రం వారు ఇవ్వ వలసిన సిస్తులను పెంచింది. ఈ రైత్వారీ సెటిల్మెంట్ అన్నది 1823 నాటికి పూర్తి అయింది. జమీందారీ శిస్తుల కన్న అ కాలంలో రైత్వారీ సిస్తులు కొంచెం ఎక్కువగా ఉండేవి. తర్వాత క్రమేణా రెండు మూడు పర్యాయాలు సిస్తులు హెచ్చింప బడినవి. ఆ కారణంచేత పైన చెప్పిన వ్యత్యాసం కొన్ని చోట్ల కలిగింది. అందుచేత ప్రకాశంగారు శాసన సభలో, కళా వెంకటరావు గారు పెట్టిన బిల్లు చర్చింపబడే ముందు "ఇది సిస్తుల హెచ్చింపు బిల్లు; తగ్గింపు బిల్లుకాదు" అని వ్యాఖ్యానించారు.

6

పరిపాలనా విధానము -

ముఖ్యమంత్రితో తలపట్లు

ప్రకాశంగారి దృక్పథం రాజాజీ దృక్పథంకన్న భిన్నం కావడంచేత చిల్లరమల్లరగా ఏవో సుడిగాలు లెప్పటికప్పుడు వీస్తూండేవి. రాజాజీ, ప్రకాశంగారల దృక్పదాలలోని భేదాలను పోలీసుశాఖ విషయంలో వారి అభిప్రాయాలబట్టి నిర్ణయించవచ్చు.

రాజాజీకి పోలీసుశాఖపై అమితమైన నమ్మకము. దాన్ని నమ్మకపోతే రాజ్యం నడవదని వారి దృక్పథము. కాని, ఆ దృక్పథం తప్పు చేసినప్పటికీ పోలీసు ఉద్యోగులను ఏమీ అనరాదన్నంత దూరం వెళ్ళేది. 1932 సత్యాగ్రహంలో, ఒక బహిరంగ సభలో వేదికపై నున్న మహర్షి బులుసు సాంబమూర్తిగారిని, ఆయన స్మృతి తప్పి