పుట:Naajeevitayatrat021599mbp.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంగా గాంభీర్యంగల వ్యక్తిగనుక, కొందరే ఆ విషయం కనిపెట్టగలిగినారు. దీనికి తోడు ఆ ఫైలు మీద ఆమోద సంతకం తాను పెట్టేముందు వల్లభభాయి పటేలుగారితో సంప్రతింపు చేయాలని ఆయన అనుకున్నట్టూ, ఒకమారు ఆ ఫైలుతనతోబాటుగ బొంబాయి పట్టుకువెళ్ళినట్టు ఒక వదంతి బయలుదేరేసరికి ప్రకాశంగారి కోపతాపాలు మరింత హెచ్చినవి.

ఇదిగాక, ఇంకా మరొకటి కూడా సచివాలయంలో జరిగింది. ప్రకాశంగారి నివేదికలో గల శిఫార్సులకు ఉండగల అభ్యంతరాలను గూర్చి రెవిన్యూశాఖ ఉద్యోగి ఒకరు ఒక వ్యాఖ్య వ్రాయడం జరిగింది. బిల్లులోని ఖండ ఖండముల మీద శాఖవారు వ్రాసిన వ్యాఖ్య సంపుటివలె ఆ వ్యాఖ్యలు కనిపించినాయి. శాసన సభ నివేదిక భాగంగా ఆమోదించిన బిల్లుపైని ఎటువంటి వ్యాఖ్యానాలు చేయగూడదని, అట్లా చేయవలసిందని ఎవరైనా తనకు తెలియకుండా ఆదేశిస్తే, అది ద్రోహచ్చాయగల కార్యమని ప్రకాశంగారి అభిప్రాయము. మంత్రి మండలి బిల్లును అంగీకరిస్తే ఈ వ్యాఖ్యలు నిర్వీర్యమైపోతాయి. బిల్లును మంత్రిమండలి అంగీకరించకపోతే ఈ వ్యాఖ్యలకు అర్థం లేకుండా పోతుంది. అయినా, మొత్తం మీద శాసన సభలో ఆమోదింపబడిన తరువాత ఈ సందిగ్ధ పరిస్థితులలోనే ప్రకాశంగారినివేదికకు సంబంధించిన కాగితాలు ఎనిమిది నెలలు అలాగే పడి ఉండడం జరిగింది.

1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మిగిలిన ప్రజోకార యోగ్యమైన కార్యక్రమం చాలా జరిగింది. కాని యీ బిల్లులు శాసన సభ ముందుకు తెచ్చుకొనే అవకాశం లేకపోయినది.

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అడ్డంకికూడా పోవడంవల్ల అప్పటి గవర్నమెంటులో మంత్రి అయిన కళా వెంకటరావు ద్వారా, జమీందారీలో శిస్తుల తగ్గింపు బిల్లు, జమీందారీ రద్దు బిల్లు పాసు చేయించడం జరిగింది. అయితే, వారు ప్రకాశంగారి అభిప్రాయాలు పూర్తిగా ఒప్పుకోక పోవడంవల్ల ఒక ముఖ్యమైన భేదం కలిగింది. జమీందారీలలో 1802 నాడు అమలులో ఉన్న సిస్తులు అమలు పరచవలెనని ప్రకాశంగారి