పుట:Naajeevitayatrat021599mbp.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖాలలో పోయే జమీందారీలకోసం మనకెందుకీబాధ అన్నభావం కల్గినట్లు నాకు కనిపించింది. కాగా, ఈ ఉపన్యాసపు ప్రభావం ముఖ్యమంత్రిగారిమీద ఎలా పడిందో మనం ముఖ్యంగా చూడాలి. శాసన సభా కార్యక్రమంవరకు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.

రెండురోజులు చర్చ జరిగిన తర్వాత ఎవరూ అనుకోకుండా ముఖ్యమంత్రి రాజాజీ లేచి, మాట్లాడనారంభించేసరికి యావన్మంది సభ్యులు ముగ్దులైపోయారు. అందరూ ప్రకాశంగారి అభిప్రాయానికి ఆయన ఎంతవ్యతిరేకంగా ఉంటాడని అనుకున్నారో, అంత సుముఖంగా మాట్లాడారు. ప్రకాశంగారు మితవాది అనీ, తానే విప్లవవాది అనీ నలుగురూ అనుకొనే విధంగా మాట్లాడి - భూమిపై హక్కు రైతుదేనని, సిస్తులు హెచ్చించడానికి జమీందార్లకు హక్కు లేదని మొదలుగాగల ప్రకాశం కమిటీ శిఫార్సులను, అందులో ఉన్న భాషకన్న పటుత్వమైన భాషతో మాట్లాడి బలపరిచారు. దీనివల్ల శాసన సభలో ఒక సామరస్య సూచకమైన వాతావరణం ఏర్పడింది. నివేదిక, నివేదికతోబాటు పొందుపరచిన బిల్లులు శాసన సభ ఆమోదించి, వాటి ప్రకారం శాసనం ప్రవేశపెట్టాలని తీర్మానం అంగీకరింపబడింది.

5

జమీందారీల రద్దు బిల్లు:

శాసన సభలో చర్చలు

అయితే, ఈ బిల్లుకు వచ్చిన అడ్డంకులు అప్పటితో ఆగిపోలేదు. ప్రభుత్వం కార్యనిబంధనల ప్రకారం బిల్లులో ఉన్న ప్రతి క్లాజు (ఖండము) యొక్క భాష, ఉద్దేశము, పొందిక సంబంధించి సచివాలయంలో ఆ బిల్లుకు సంబంధించిన శాఖవారు తమ వ్యాఖ్య వ్రాయాలి. ఆ విషయానికి సంబంధించిన ఇతర ప్రభుత్వ శాఖలు, ఈ ఫైలు