పుట:Naajeevitayatrat021599mbp.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమర్పించాను. ఈ కమిటీ చర్చించిన విషయం - భూస్వాములకూ, రైతులకూ మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలను గురించినది. మా నివేదికను ఈ సభవారికి కొంత ఆలస్యంగా అందజేసినందుకు నేను సంజాయిషీ చెప్పవలసిఉంది. ఈ నివేదిక తయారుకావడానికి దాదాపు 15 మాసములు పట్టింది. మేము ఈ రాజధానిలో ఉత్తరభాగంలో రెండు కేంద్రాల లోను, దక్షిణభాగంలో రెండు కేంద్రాలలోను, రాజధాని నగరమయిన చెన్న పట్నమందునూ, సాక్ష్యాలు సేకరించితిమి. సాక్ష్య మిచ్చుటకు వచ్చిన సాక్షులందరి సాక్ష్యములను వ్రాసు కొన్నాము. వారు దాఖలు చేసిన కాగితములను అందుకున్నాము. ఇది జరిగిన తర్వాత ఉపసంఘం సభ్యుల వీలునుబట్టి మా సమావేశాలు జరిపేందుకు కొంతకాలం పట్టింది. మేము ఒక్క రోజుకూడా వృథా చేయలేదు. ఇతర కార్యాలకు భంగం లేకుండా ఈ ఉపసంఘం పని శ్రద్ధగా నడిపినాము పరిశీలనా సమయంలో అనేక వ్యాఖ్యలు - ముఖ్యంగా మేము ఆలస్యం చేసితిమన్న వ్యాఖ్యలు కూడా - వచ్చినవన్న విషయం నాకు గుర్తున్నది. అయితే, అటువంటివాటిని పట్టించుకోక మేము మా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్నాము. అధ్యక్షా! మరొక విషయం చెప్పాలి. మా నివేదికను శాసనసభకు అందజేసేముందు, కొందరు తమకూ తమ హక్కులకూ భంగం వాటిల్లుననే భయంతో దీనిని రహస్యంగా ఉంచివలసినదంటూ, అలా ఉంచేటందుకు ప్రయత్నాలు చేసినారు. వారి ఆ యత్నాలు ఫలించలేదు. నిబంధనల ప్రకారం శాసన సభా కార్యదర్శిగారికి సూచించిన ఒక తేదీనాడు నివేదికను శాసనసభ కందజేస్తామని నోటీసులు ఇచ్చాము. ఆ ప్రకారంగానే వాటిని అందజేశాము"

అని మెల్లిగా ప్రారంభించి, మూడు రోజులబాటు నివేదికలోని అంశాలను సహేతుకంగా, ఉద్రేకంలేని మాటలతో, వినేవారికి ఉద్రేకం కల్గించేటట్లు మాట్లాడగా, సభలో శాసన సభ్యుల అందరి