పుట:Naajeevitayatrat021599mbp.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26 న తంబుచెట్టి వీధిలో సత్యాగ్రహం ప్రారంభించ నున్నానని తెలియజేశాను. తంబుచెట్టి వీధి హైకోర్టుకు ఎదురుగా ఉన్న వీధులలో ఒకటి.

గిరిగారికి రాజాజి అభ్యర్థన

గాంధీగారి వద్దనుంచి ఉత్తరం రాగానే రాజగోపాలాచారిగారు వార్ధా పరుగెత్తాడు. అక్కడ గాంధీగారి నినాదాల్నిగురించి, దానికి ప్రత్యామ్నాయంగా తాను వ్రాసిన ఉత్తరం గురించీ తర్జన భర్జన జరిగింది. రాజగోపాలాచారిగారు తన ఉత్తరం ఆయన నినాదాలకంటె మంచిదని, అది యావత్తు భారతదేశానికీ వర్తించే విధంగా వ్రాయబడిందనీ వాదించారు గాని, గాంధీగారిని తన అభిప్రాయాన్ని అంగీకరించేలా చేయలేక పోయాడు.

రాజగోపాలాచారిగారు వెనక్కి బయల్దేరాడు. అదే రైలులో డిల్లీ నుంచి పట్నం వస్తూన్న గిరిగారు ఉండడం తటస్థించింది. అల్లా కలిసి ప్రయాణం చేస్తూన్న సందర్భంలో గిరిగారూ, రాజగోపాలాచారిగారూ మాట్లాడుకోవడానికి అవకాశం కలిగింది. ఆ మాటలలో ఆయన గిరిగారితో తనకూ గాంధీగారికీ మధ్య నడచిన గ్రంథమంతా చెప్పాడు. తన పద్దతికి గాంధీ గారు ఎల్లా ఒప్పుకోలేదో వివరించాడు. తాను గాంధీగారితో గట్టిగా వాదిస్తే ఆయన రక్తపు పోటు ఎక్కడ అధికం అవుతుందోనన్న భీతితో ఎక్కువగా వాదించలేదని చెప్పాడు. గాంధీగారి నినాదాల కంటె తన ఉత్తరమే మేలుగా వ్రాయబడిన కారణాన్ని, తన పద్దతినే గిరిగా రంగీకరించడం న్యాయమని అభ్యర్థించాడు.

గిరిగారి సమాధానం

గిరిగా రప్పుడు, గాంధీగారి కార్యక్రమానికి వ్యతిరేకంగా తానెప్పుడూ నడవననీ, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీవారి సూచనలూ, దానికి అధ్యక్షుడయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి సూచనలూ తానెప్పుడూ వ్యతిరేకించననీ స్పష్టం చేశారు.

గిరిగారు నవంబరు 25 ఉదయానికి పట్నం వచ్చారన్న సంగతి ఆ రాత్రి చాలా పొద్దుపోయిందాకా నాకు తెలియదు. నవంబరు 26 ఉదయాన్నే నేను గిరిగారిని వారి ఇంటివద్దనే కలుసుకుని, ఆయన