పుట:Naajeevitayatrat021599mbp.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారి నినాదాలకీ పొంతనం కుదరక పోవడాన్ని, ఆయనకు అల్లా అడగాలని బుద్ధి పుట్టిందట. రాజగోపాలాచారి తెలివయిన వాడయితే అయి ఉండవచ్చుగాని, నా సూచనలను ఇల్లా తయ్యారు చెయ్యడం మాత్రం తగని పనేనని గాంధీగా రన్నారట! ఈ విషయంలో రాజగోపాలాచారి గారికి తాను వ్రాసిన ఉత్తరం గాంధీగారు వెంకట్రావుకు చూపించారట. కాగా, గాంధీగారు తన నినాదలనే ప్రతి సత్యాగ్రహి ఉచ్చరించాలనీ, అల్లా జరిగేటట్లుగా చూడమనీ వెంకట్రావుతో చెప్పారట. ఈ సంగతులన్నీ బందరులో వెంకట్రావు నవంబరు 24 న చెప్పినప్పుడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మేము నిజంగా రాజగోపాలాచారి గారి ఉత్తరాన్నే పట్టుకుని కూర్చుంటే చాలా పెద్ద తప్పే చేసినవారమై ఉండేవారం. వెంకట్రావే గనుక గాంధీగారి దగ్గరకు వెళ్ళి సంగతి సందర్భాలు గ్రహించి ఉండకపోతే, కథ అడ్డంతిరిగి, ఆచారి గారు మా చేత ఆడకూడని నాటకం ఆడించి ఉండేవాడు. వెంకట్రావు నిజంగా చాలా శక్తిసామర్థ్యాలు గల వ్యక్తి. ఆయన మొదటి నుంచీ మేము చేస్తూన్న పనులనన్నింటినీ క్షుణ్ణంగా గ్రహించిన వ్యక్తి.

ఏ విధమయిన మార్పు లేకుండా ప్రతి సత్యాగ్రహీ గాంధీగారి నినాదాల్నే వాడాలని మా కార్యనిర్వాహకవర్గంలో నిశ్చయించు కున్నాము. అప్పుడే, ఆ సభలోనే నేనూ మొదటి జట్టుతోనే నవంబరు 26 న సత్యాగ్రహంలో పాల్గొనాలని నిశ్చయించాను. నేను డిసెంబరు ఆఖరువరకూ బయటే ఉండాలను కుంటున్నానని వెంకట్రావు గాంధీగారితో చెప్పినప్పుడు, ఎంత త్వరగా సత్యాగ్రహంలో పాల్గొంటే అంత మంచిదని ఆయన సూచించినట్లు వెంకట్రావు ద్వారా వినడాన్ని, వెంటనే ఆ మొట్టమొదటి జట్టుతోనే సత్యాగ్రహం చేద్దామని నిశ్చయించుకున్నాను.

నేనూ, వెంకట్రావూ కలసి ఆ రాత్రే బందరునుంచి బయల్దేరి నవంబరు 25 ఉదయానికి పట్నం చేరుకున్నాము. నేను ప్రభుత్వ కార్యదర్శికి వ్రాసిన ఉత్తరం వెంకట్రావే సహాయంగా తీసుకు వెళ్ళి ఆయనకు అందజేశారు. అందు నేను ఆ మర్నాడు, అనగా నవంబరు