పుట:Naajeevitayatrat021599mbp.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశం అల్లా సందిగ్ధ పరిస్థితులలోకి జారిపోయేది. రాజగోపాలాచారిగారు గాంధీగారి అహింసా విధానంమీద పూనా సభలో చేసిన స్వారీ విషయం చెప్పేఉన్నాను. దర్మిలా గాంధీగారి నినాదాలను అపహాస్యం చేశారు. రాజగోపాలాచారిగారి దృష్టిలో గాంధీగారు నిర్దేశించిన నినాదాలు అర్థరహితమయినవి.

అందువల్ల వాటికి బదులుగా ప్రతీప్రాంతంలోనూ ఉన్న యుద్ధ కమిటీ సభ్యులకు, ఉత్తరాల పూర్వకంగా, యుద్ధ నిధులను సేకరించవలదనీ, యుద్ధానికి జనాన్ని ప్రోత్సహించి జవాన్లను ఎంచుకో వద్దనీ, తాము ఆ కమిటీనుంచి విరమించడం ఉత్తమమనీ సలహా సూచకంగా ఉత్తరాలు వ్రాయమన్నాడు. గాంధీగారి నినాదాలకు బదులుగా వ్రాయవలసిన ఉత్తరాలు ఎల్లా ఉండాలో ముసాయిదా తయారు చేశాడు.

మా కార్యదర్శి అయ్యదేవర కాళేశ్వరరావు వార్ధానుంచి తిరిగివచ్చి సంగతి సందర్భాలు చెప్పేదాకా, నవంబరు 23 న వార్ధాలో ఏం జరిగిందీ మాకు తెలియదు. గాంధీగారి నినాదాలకు బదులు, రాజగోపాలాచారిగారు తయారుచేసిన ముసాయిదా ఉత్తరమూ, అందులో వ్రాయబడిన విషయాలన్నీ మాగంటి బాపినీడుగారు సంపాదించిన నకలువల్ల మాకు తెలియ వచ్చాయి. ఆ ఉత్తరం చాలా పెద్దది. హేతువాదాత్మకంగా ఉంది. విసుగు పుట్టించేదిగా కూడా ఉంది. జరిగిన గ్రంథమంతా తెలియకపూర్వం బాపినీడుగారు తీసుకు వచ్చిన ఉత్తరాన్ని చూసి, రాజగోపాలాచారిగారు గాంధీగారికి వ్యతిరేకంగా, ఆయన్ని కాదని ఈ ఉత్తరాన్ని వ్రాసి ఉండడనే తలుస్తూ ఉండడాన్ని, సత్యాగ్రహం చేసే వారందరూ ఆ ఉత్తరానికి నకళ్లు వ్రాసుకోవడంలో నిమగ్నులయి పోయారు. మర్నాడు నేను గాంధీగారి నినాదాల నకళ్ళు చూశాను.

గాంధీగారి మందలింపు

కళా వెంకట్రావు వార్దాలో గాంధీగారిని, రాజగోపాలాచారిగారి ముసాయిదా ఉత్తరాన్ని గురించి అడిగాడట. ఆ ఉత్తరానికీ, గాంధీ