పుట:Naajeevitayatrat021599mbp.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొద్దిపాటి రొక్కానికే, చేత బట్టాలని చూశాడు. నేను జాగ్రత్తగా, ఆ వ్యవహారం నడిపిస్తూ, నా ప్లీడర్లు నన్ను జారవిడిచిన సందర్భాలలో నేనే స్వయంగా వాదించుకుంటూ, కంపెనీ మూసివేయాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రతి పిటీషనూ నెగ్గుకుంటూ వచ్చాను.

మిస్టర్ జస్టిస్ జెంటిల్ (Mr. Justice Gentle) వద్ద ఆఖరు సారిగా దాఖలు చేయబడిన పిటీషన్ విచారణకు వచ్చినప్పుడు, ఆ ఇంటి యజమాని కివ్వవలసిన అద్దె బకాయి ఎంతో నిర్ణయించ వలసిందనీ, ఆ పద్దులన్నీ సరిచూసి నికరం బాకీలు తేల్చవలసిందనీ ఆ జడ్జీగారు ఆర్డరు జారీ చేశారు.

అప్పీలు కోర్టులోకి ఆ వ్యవహారం వచ్చిన సందర్భంలో, ఆ సూర్యనారాయణ రావు తనకు రావాలని చూపించిన అంకెలు తప్పని వాదించాను. అప్పటికి, పరిస్థితుల ప్రభావం వల్లనే మదరాసు ప్రభుత్వంలో రెవిన్యూమంత్రిగా ఉండటం తటస్థించింది. అందువల్ల నేను స్వయంగా జడ్జీల ఎదుట నిలబడి వాదించడానికి సావకాశం (మంత్రులు కోర్టులలో జడ్జీల ఎదుట లాయర్లుగా నిలిచి వాదించడం న్యాయ విరుద్ధమూ, మంత్రి హోదాకు భంగమూను) లేకుండాపోయింది.

ఆ అప్పీలు కోర్టులో జడ్జీలలో ఒకరయిన జస్టిస్ వరదాచారి గారికి కంపెనీ మూసి వేయడమే న్యాయమని తోచింది. నా అభ్యంతరం కేవలం జమాఖర్చులకు సంబంధించిందే అయిన కారణాన్ని ఇవ్వ తేలే మొత్తం చిన్నదయినా పెద్దదయినా, ఈ పరిస్థితులలో కంపెనీని మూసి వేయడమే న్యాయమని ఆయనకు తోచింది.

ఈ లావాదేవీలన్నీ సుదీర్ఘంగా నడిచాయి.[1] కంపెనీ మూసివేయ వలసిందేను అన్న ఆ జడ్జీగారి తీర్పు న్యాయమైంది, సవ్యమైంది కాదంటూ, హైకోర్టు ఒరిజనల్ సైడున ఒక దావా వేశాను. దగాచేసే ఉద్దేశంతో వ్రాయించుకున్న ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజూ, తనఖా దస్తావేజూ

  1. వీటిని గురించి "స్వరాజ్య పత్రిక - కంపెనీ" అన్న ప్రకరణంలో వివరంగా వ్రాద్దా మనుకున్నారు.