పుట:Naajeevitayatrat021599mbp.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెల్లవనీ, నేను నా కుమారులూ అప్పటికి చనిపోయిన హనుమాయమ్మగారి సన్నిహితవారసులుగా ఆమె హక్కులను రక్షించవలసిన బాధ్యత మా పైన ఉన్నదనీ, కంపెనీ తాలూకు ఆస్తులన్నీ మాకు చెందాలనీ, ఎటొచ్చీ సూర్యనారాయణ రావుకు అద్దెబాపతుగా ముట్టవలసిన సొమ్ముకు మాత్రమే అతడు అర్హుడనీ మా దావాలో పేర్కొన్నాము.

ఈ దావాలో జస్టిస్ సోమయ్యగారు మా పక్షంగానే తీర్పు ఇచ్చారు.

కాని ఇది ఇల్లా నడుస్తూ ఉండగానే, కంపెనీ వైండింగ్ ఆర్డరును పురస్కరించుకుని కంపెనీ తాలూకు ఆస్తులన్నీ విక్రయించబడ్డాయి. వేరే దావా వేసిన కారణంగా, ఆ కంపెనీ తాలూకు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఇన్‌జక్షన్ ఇప్పించవలసిందని మేము కోరిన ఆర్డరు నిరాకరించబడింది. అందువల్ల ఆ ఆస్తులన్నీ అల్లా అల్లా అమ్మకం అయిపోయాయి. వేలూ, లక్షలూ ఖరీదుచేసే ఆస్తులు టూకీగా వందలూ, వేలూ మీద ఎగిరిపోయాయి. ఆ ఆస్తులేవీ తిరిగి స్వాధీనపరచుకునే అవకాశం లేకుండా పోయింది.

ఫలితం దక్కని విజయం

అందువల్ల మాకు కలిగిన జయం కేవలం కాగితంమీదనే అని అనుకోక తప్పదు. ఈ డిక్రీమీద సూర్యనారాయణ రావు అప్పీలు పడేశాడు. తుదకు ఆస్తుల అమ్మకంవల్ల కోర్టులో జమఅయిన రొక్కాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీపడ్డాం.

ఒక కోర్టులో దోషంలేదని నిరూపించబడ్డా, కోర్టువారు నా వాదన న్యాయమయిందేనని కేసు నా పక్షంగా తీర్పు ఇచ్చినా, అంతిమ విజయం నాదేఅయినా, ఆస్తులు స్వాధీనంఅయ్యే పరిస్థితి చేయిజారిపోవడాన్ని - మీరు రాజీపడితే బాగుంటుందేమోననే కోర్టువారి సలహాను పురస్కరించుకుని, రాజీకి ఒప్పుకున్నాను.

నిజానికి ఆ సంస్థను మూసివేయడానికి నాకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. పూర్తిగా నన్ను నమ్మి, నా యందుఉన్న అఖండిత విశ్వాసంతో, ఈ దేశీయులేగాక పైదేశాలవారు కూడా, ఏ విధమయిన అపేక్షలూ