పుట:Naajeevitayatrat021599mbp.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లింది కాస్తాకూడా తనఖా పెట్టడానికి పరిస్థితులనుబట్టి ఒప్పుకోవలసి వచ్చింది.

నన్ను పూర్తిగా దగా చేయగలిగిన ఆ సూర్యనారాయణ రావు, ఈసారి నన్ను తిరిగి కలుసుకుని తనఖా దస్తావేజు ముసాయిదా అంగీకరింపజేయడానికి తంటాలు పడకుండా, తెలివిగా తప్పుకున్నాడు. అతడు లోపలికివచ్చి ఉంటే, ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజు విషయంలో నాకు చేసిన దగా గురించి అడిగి ఉందును. అతడు ఈ రెండు సందర్భాలలోనూ, జాగ్రత్తగా ప్లానువేసుకుని, మమ్మల్ని నిర్భంధించి, మా చేత ఆ రెండు దస్తావేజులూ వ్రాయించుకో గలిగాడు.

మొదటిది - నా భార్య హనుమాయమ్మకు 'స్వరాజ్య' కంపెనీపై రెండు లక్షల పై చిలుకు రొక్కానికి ఉన్న హక్కులన్నీ ఆయన పేర ట్రాన్స్‌ఫరుకు సంబంధించిందీ, రెండవది - మిగిలిన చర, స్థిర ఆస్తులన్నీ సీదాగా అతని పరం చేసేదీ. అంతేకాదు - నాచేతా, నా భార్యచేతా కూడా ఉత్తరాలు వ్రాయించుకున్నాడు. ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజువల్ల కాని, తీరని ఆర్థికమైన లోటుపాట్లు ఏవయిన ఉంటే వాటి విషయంలో మేము ఇరువురమూ స్వయంగా బాధ్యులమనీ ఆ ఉత్తరంలో వ్రాసి ఇచ్చాము.

ఈ విధంగా నేను వెల్లూరులో ఖైదీగా ఉంటూన్న ఆ రోజులలో సూర్యనారాయణ రావు తంత్రంలో పడిపోయి, బలవంతంగా ఆ దస్తావేజులు వ్రాసి ఇచ్చాను.

ఆపైని హైకోర్టు

స్వరాజ్య కంపెనీ తరువాత చరిత్ర సుదీర్ఘమై అనేక సంఘటనలతో కూడుకుని ఉంది. అలా దగాగా సంపాదించిన ఆ రెండు దస్తావేజులు ఆధారంగా ఆ సూర్యనారాయణ రావు, హైకోర్టుకి వెళ్ళి 'స్వరాజ్య' కంపెనీని ఎల్లాగయినా మూయించేసి, ఆ కంపెనీ తాలూకు యావదాస్తినీ - అనగా అచ్చాఫీసు, లినో మిషన్లు, బిల్డింగులు, ఖాళాజాగా వగైరా - తనకు బాకీగా ఉన్నామని చెప్పబడే అద్దెబకాయి కింద, ఆ