పుట:Naajeevitayatrat021599mbp.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొత్తరకం కురుపులు, సెగ్గెడ్డలూ తలలోనే గాక, శరీరంమీద కూడా లేచాయి. వీటివల్ల కలిగిన బాధ మశూచికపు బాధతో సమానంగా ఉండేది. గడచిన 35 ఏళ్ళుగా నేను అనుసరిస్తూన్న తొట్టి స్నానపు వైద్యం ఈ కురుపులు తగ్గడానికి ఎంతయినా సహాయకారిగా ఉండేది కాని, ఉన్నది జెయిలు; దాని అధికారా - మిస్టర్ హో ( Mr. Howe)

మిస్టర్ హో అక్కడ జెయిలు అధికారి. ఖైదీలను అమానుషంగా చూడడమూ, వారిని రకరకాల బాధలకు లోనుచేయడమూ ఆయనకు సరదా. ఖైదీ మామూలు ఖైదీయేనా, లేక 'ఎ', 'బి', 'సి' వర్గాలలో దేనికైనా చెందుతాడు అన్న ప్రశ్నలేకుండా, పాపం, ఆయన అందర్నీ ఒకేరకంగా, మామూలు దృష్టితోనే చూసి హింసించడంతో, ఉద్యోగం స్వీకరించిన మొదటి దినాలలోనే ఖ్యాతి గడించాడు. నా మామూలు అలవాటు ప్రకారం ఒంటిమీద ఏ విధమయిన ఆచ్ఛాదనా లేకుండా, హాయిగా కాళ్ళు జాపుకుని, ఇంటివద్ద పడుకునే రీతిగానే, ఆ అస్వస్థపు దినాలలో జెయిలులో పడుకుని ఉండేవాడిని.

ఒక రోజున నేను అల్లా పడుకుని ఉండగా, ముందు హెచ్చరిక లేకుండా నా గదిలోకి వచ్చి నా మంచం పక్కన నిలబడి ఒకటి రెండు నిమిషాలపాటు నావైపు చూశాడు. ఆయన్నిచూసి జెయిలు సూపరెంటెండెంటుగా గ్రహించుకుని, వెంటనే లేచి, ఆయనకు లాంచన ప్రకారంగా చేయవలసిన సలామో, గుడ్‌మార్నింగ్ చెప్పడమో చెయ్యకపోవడాన్ని ఆయన శాంతిని గోల్పోయి, చాలా మెల్లిగా "నేను సూపరెంటెండెంట్ నన్న సంగతి తెలియదా? ఇక్కడ కొన్ని నిమిషాలుగా ఉన్నా మంచంమీద పడుకున్నవాడివి లేవనయినా లేవలే" దన్నాడాయన. నేను చిన్ననవ్వునవ్వి "జెయిలు సూపరెంటెండెంట్ అన్నవాడికి ఖైదీలపట్ల, అందులో రోగంతో తీసుకుంటూన్న ఖైదీలపట్ల, ఒక బాధ్యత ఉన్నది కదా? సూపరెంటెండెంట్ అయినా, రోగంతో తీసుకుంటూన్న ఒక ఖైదీ గదిలోకి, ఒంటిమీద సరిగా బట్టయినా లేని స్థితిలో ఆ రోగి ఉంటూన్న సమయంలో, హెచ్చరికయినా లేకుండా చొచ్చుకుని రావడం న్యాయం కా"దన్నాను. "ఖైదీగా సూపరెంటెండెంట్‌కు