పుట:Naajeevitayatrat021599mbp.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తావులలో ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా నడపించింది. పురుషులు జంకి వెనక్కు తగ్గే పరిస్థితులలో కూడా ఆమె మంచి నేర్పుతో వ్యవహరించింది. ఆమె అకాల మరణం దేశానికి తీరని లోటే.

ప్రక్కని దాడి చెయ్యడానికి ఉప్పు కొఠారులున్నాయా లేదా అనికాదు ప్రశ్న. సమీపాన సముద్రం ఉందా లేదా అన్న ఒక్క విషయం మీదనే ఆధారపడి, ఆంధ్రదేశంలోని కోస్తా జిల్లాలవా రందరూ శక్తి వంచన లేకుండా ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని కీర్తిని గడించారు.

1930 నాటి ఉప్పు సత్యాగ్రహ చరిత్ర యిది. ఆ చరిత్రలో మద్రాసు నగరంతో సహా ఆంధ్రరాష్ట్రం ఎల్లా ముందుకు ఉరికిందో సంగ్రహంగా మనవి చేశాను. సహకార నిరాకరణ మారంభమయింది లగాయితు, శాసన ధిక్కారం, ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణలాంటి అనేక జాతీయ ఉద్యమాలలో ఆంధ్రులు చరిత్రాత్మకమైన పాత్ర వహించారు. ఇది నిజంగా వారికి గర్వకారణమే. నిర్మాణ కార్యక్రమంలో కూడా వారి దెప్పుడూ పైచెయ్యే. 'ర్యాలి' లో పంచాయతీ ఏర్పరచి, వారు రాజ్య తంత్రాన్ని నడిపిన తీరు అద్వితీయం. అడిగిన తక్షణం, ఆడవారే స్వయంగా వారి చేతులతోనే, వారివారి ఆభరణాలన్నింటినీ ఒలిచి, గాంధీగారి ఒడిలో పోసి స్వాతంత్ర్యోద్యమాని కిచ్చిన చేయూత స్త్రీ లోకానికే గర్వకారణం.

10

జెయిలు అనుభవాలు

ఆ 1930 - 31 లో ఎందువల్లనో గాని నన్ను ఆ జెయిలు నుంచి ఈ జెయిలుకీ, ఈ జెయిలునుంచి ఇంకో జెయిలుకీ, ఇల్లా పలు తావులలోని జెయిళ్ళకి మార్చారు. అందువల్ల ఎన్నో జెయిళ్ళను చూడగల విశేషాధికారాన్నీ, హక్కునూ నాకే ఇచ్చారనుకుంటాను. నాటి జైళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. రాజ