పుట:Naajeevitayatrat021599mbp.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమూ గల వర్తక వ్యాపారి అవడాన్ని, ఆయన తన రాజీనామా, మా అందరితోనూ కలిసి కాక, విడిగా ఇస్తానని చెప్పాడు.

జయకర్‌మాత్రం ప్రతి మీటింగులోనూ మాలవ్యాగారు రాజీనామా ఇవ్వకుండా చూడాలని అనేక విదాల తంటాలు పడ్డాడు. రాజకీయంగా మా దృక్పథాలు వేరయినా, నాకూ జయకర్‌గారికీ మధ్య సన్నిహితమైన మైత్రి ఉండేది. ఆయన తమ పార్టీని విచ్ఛిన్నం చేశానంటూ నన్ను ఆడిపోసుకునేవాడు. ఈ మా చర్యలను కనిపెడుతూన్న "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక, ఒక మదరాసు సభ్యుడు వచ్చి, మాలవ్యాగారి పార్టీలో ఈ మధ్య చేరినట్లే చేరి వారి పార్టీని ఛిన్నాభిన్నం చేశాడని బొంబాయినుండి చాలాసార్లు వ్రాసింది. ఘనశ్యాందాసు బిర్లాకి శాసన ధిక్కార ఉద్యమంలో చేరాలని లేదు. అందుచేతనే ఆయన తన రాజీనామా విడిగా సమర్పించాడు.

మాలవ్యా ప్రభృతులతో కలిసి రాజీనామా

మాలవ్యాగారితో కలసి పదముగ్గురం, జాయింటుగా ఒకే రాజీనామా పత్రం సమర్పించాము. మాలవ్యాగారూ, అనే మొదలైన వారు గొప్ప దేశభక్తులు. దేశానికి సేవ చెయ్యడానికి వా రెప్పుడూ సంసిద్ధులే. అందువల్ల వారి విషయంలో ప్రోద్బలం అంతగా అవసరం లేకపోయింది. కారణాంతరాలవల్ల తాము వేరే పార్టీ సభ్యులుగా చెలామణి అవుతూన్నా, నిజానికి వారు మంచి శక్తి మంతులు. మాలవ్యాగారు కాంగ్రెసు వారిని కూడా ఎటువంటి ప్రత్యక్ష చర్యా కార్యక్రమంలో నయినా నాయకత్వం వహించి, నడపగల యోధుడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వారికి నేను ఈ ప్రత్యక్ష చర్య మొదలైన విషయాలను గురించి చెప్పినప్పుడు, ఏ విధమయిన ప్రోద్బలమూ లేకుండానే, వారంతట వారే ముందుకు వచ్చి, అగ్ని గుండంలోనికి దూకడానికి సిద్దమయ్యారు. వారి పార్టీ చిహ్నం ఏదయినా, సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభం అయినప్పటినుంచీ వారిని గమనిస్తూన్న కారణంగా, వారంటే నాకు అభిమానమూ, గౌరవమూ కూడా ఏర్పడ్డాయి.