పుట:Naajeevitayatrat021599mbp.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాదాభాయి నౌరోజీగారు 1906 లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా లండన్ నుంచి భారతదేశానికి వచ్చి 'స్వరాజ్య' అన్న పదాన్ని విపులీకరించి, 'స్వరాజ్‌' అనగా పూర్తి స్వాతంత్ర్యమనీ, ఆ రోజులలో ఎన్నో దేశాల వారు బ్రిటిషువారికి బద్ధులయి అనుభవిస్తూన్న స్వాతంత్ర్యంలాంటిదనీ నిర్వచనం ఇవ్వ వలసివచ్చింది.

అధమం అప్పటినుంచీ అయినా ఆ మితవాదులు ఏటేటా ఆ 'స్వరాజ్యాన్ని' వాంఛిస్తూ ఉండి ఉండవలసింది. అల్లా 1917 వరకూ జరిగి ఉంటే ఎంతో బాగుండేది. 1917 లోనే కాంగ్రెసు మితవాదుల చేతులలోంచి మారి, కొద్దికాలం తిలక్ మహాశయుని అడుగుజాడలలో నడుస్తూ, గాంధీగారి కైవసం అయింది.

మితవాదులా 'స్వరాజ్యాన్ని' కోరలేకపోయారు. 'స్వరాజ్య' అన్న పదానికి వెనుక ఇంత చరిత్ర ఉన్నా, హజరత్ మొహనీ 'స్వరాజ్య' అన్న పదం వాడి:ఉంటే, ఆ కోర్కెలో తప్పేమీ లేదని గాంధీజీ గుర్తించి ఉండవలసింది. కాని వెనువెంటనే జరిగిన హజరత్ మొహనీ నిర్భంధమూ, కేసూ, విచారణా గమనించిన నాకూ, ఇతర మిత్రులకూ కూడా గాంధీగారు అన్న 'లోతు పాతులు గ్రహించి మరీ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడు' అన్న హెచ్చరిక లోని 'లోతుపాతు' అన్న పదాన్నే అడ్డం పెట్టుకుని హజరత్ మొహనీ పైన ప్రభుత్వంవారు విరుచుకు పడ్డారా అనిపించింది. అదే "స్వాతంత్ర్యం" అన్న ఆశయానికి ప్రాతిపదికా, జన్మ కారణమూ అయింది.

సాంబమూర్తి ఉబలాటం

తర్వాతి పరిస్థితులుకూడా గమనిద్దాం. లోగడ కొంత కాలంగా మద్రాసు శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన బులుసు సాంబమూర్తిగారు, కలగబోయే పరిణామాలను విలియా వేసుకోకుండా, "స్వాతంత్ర్యం" కోసం ప్రాకులాడ నారంభించాడు. సాంబమూర్తిగారూ, నేనూ మప్ఫయి యేండ్లకుపైగా కలిసి పనిచేస్తూ ఉన్నవారమే. ఆరంభ దినాలలో లాయర్లంగా పనిచేశాం. తర్వాత ఇరువురమూకూడా ప్రాక్టీసు