పుట:Naajeevitayatrat021599mbp.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరమించుకుని, స్వాతంత్ర్య సమరంలోకి కలిసేదూకి పనిచేస్తున్నాం. 1921 లో జరిగిన ఆ మొట్టమొదటి గోదావరి జల్లా రాజకీయ సభా కార్యక్రమాలు నా అధ్యక్షతనే జరిగాయి. అప్పుడు నేనే సాంబమూర్తిగారి 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ఎదుర్కున్నాను. అప్పట్లో గాంధీగారికిలాగే కావలసిన తయారీలేందే 'స్వాతంత్ర్యం' అన్న పదం వాడితే ప్రభుత్వంవారి చేతులలో ఎటువంటి ఫలితాలకు లోనుగావలసివస్తుందో అన్న భయం నన్నూ ఆవరించే ఉందన్నమాట!

స్వరాజ్య సమరంలో సాంబమూర్తిగారి పాత్రను గురించి ఇదివరకే చెప్పి ఉన్నాను.

జవహర్‌లాల్ చొరవ

చెన్నపట్నం కాంగ్రెసులో, అప్పుడే జినీవా నుంచి వచ్చిన జవహర్‌లాల్ నెహ్రూగారి ముఖత: ప్రతిపాదించబడింది సాంబమూర్తిగారి 'స్వాతంత్ర్య' తీర్మానమే. మదరాసు కాంగ్రెస్ రోజులలోకూడా మహాత్మా గాంధీగారు 'స్వాతంత్ర్య' తీర్మానానికి ప్రతికూలురే. జవహర్‌లాల్‌గారు తీర్మానాన్ని ప్రతిపాదించే సమయంలో గాంధీగారు ఆ కాంగ్రెసు పెండాలు గేటు దాకావచ్చి, లోపల ఏం జరుగుతోందని అడిగి, జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్య తీర్మానంపై మాట్లాడుతున్నారని విని, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, 'ఏదో బడి పిల్లల బెడదలే' అన్నారు.

ఆ రోజులలో దేశంలోని స్వాతంత్ర్యవాదుల నందరినీ అరెస్టుచేసి, కేసులుపెట్టి జెయిళ్ళకు పంపిస్తారనే వదంతి బాగా నాటుకుపోయి ఉంది. తన్ను కాదని జవహర్‌లాల్ ఆ తీర్మానాన్ని ప్రతిపాదించాడనే అభిప్రాయం గాంధీగారికి కలిగి నట్లుంది. ఈ విషయంగా తన కుమారుడు జైలుకు వెళ్ళడము మోతీలాల్‌ నెహ్రూగారి కెంత మాత్రం ఇష్టం లేదు. అసలు ఆయన స్వతంత్ర్యాన్ని వాంఛించే బాపతు కాదు. ఆఖరికి డొమినియన్ వ్టేటస్ (అధినివేశ ప్రతిసత్తి) అన్న పదజాలంమీద