పుట:Naajeevitayatrat021599mbp.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అ 1926లో స్వరాజ్య పార్టీవారు తమ కార్యక్రమం ప్రకారం అసెంబ్లీ వ్యవహారం నడవకుండా "వాకౌట్" ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ అదనులో కరెన్సీ, రిజర్వుబ్యాంకి బిల్లును ప్రవేశపెట్టి సులువుగా ప్యాసు చేయించుకుందా మనుకున్నారు ప్రభుత్వంవారు. ఒక్క ఉదుటున వాటిని ప్రవేశపెట్టడమూ, చట్టంగా రూపొందించడమూ జరిగిపోతుందని భావించారు. స్వరాజ్య పార్టీవారు అసెంబ్లీనుంచి బైటకు వచ్చేసినప్పుడు ఈ పని జరుగుతుందని ఊహించలేదు. కాని ఎప్పుడయితే ప్రభుత్వంవారి పన్నాగం వారు పసికట్టారో అ క్షణాన్నే బిలబిల్లాడుతూ లోపలికి చక్కావచ్చారు. వీరు బిల్లును ప్రతిఘటిస్తారని వారికి గ్రాహ్యం అవడాన్ని, తెలివిగా, క్రొత్త కౌన్సిల్ ఏర్పడే పర్యంతం దీనిని చర్చించరాదంటూ, ప్రభుత్వంవారే దానిని వాయిదా వెయ్యడానికి సిద్ధపడ్డారు.

ఊహాతీతమైన కారణాలు

1926 జనరల్ ఎన్నికల అనంతరం స్వరాజ్యపార్టీ మరింత ప్రభుత్వంతోనూ, జాగరూకతతోనూ వ్యవహరించసాగింది. ఈ మారకపు రేటును పెంచడానికి ప్రభుత్వంవారు ఉటంకించిన కారణాలు చాలా వింతయినవీ, ఊహాతీతమయినవీను, ఈ బిల్లు ప్రవేశపెట్టక పూర్వం కొన్ని సంవత్సరాలుగా ఉంటూన్న మారకపురేటు రూపాయికి 1షి. 4 పెన్నీలు. సర్ బేసిల్ బాకెట్ (Sir Basil Backet) అప్పట్లో ఆర్థిక సభ్యుడు. ఆయన చాలా గట్టివాడు. మంచి వాగ్ధాటి గలవాడు. శాసనసభలో అన్న స్వరాజ్యపార్టీ వారు ఎంతలే, మనం చులాగ్గా దాటుకుపోతాం అనుకున్నాడాయన. పాపం. ఆయన మాలో ఒక డజను మందిమి, అన్ని కోణాలనుంచీ ఆ విషయాన్ని తర్జనభర్జన జేసి, ఆట కటిస్తామని కలలో కూడా అనుకోలేదు.

ఈ దేశపు ప్రజల గతి ఏమయినా, తన దేశీయుల క్షేమలాభలే చూసుకునే రకం సర్ బేసిల్. పైనాన్స్ మెంబర్‌గా కొత్తగా నిర్మాణమైన కౌన్సిల్‌లో రిజర్వు బ్యాంకి బిల్లూ, ఎక్ఛేంజి బిల్లూ ఆయన ప్రతిపా