పుట:Naajeevitayatrat021599mbp.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారొకరున్నారు. ఆ యిరువురూ పెద్ద వ్యాపార సంస్థల కధిపతులు. వాణిజ్యం వారి చేతులలో ఉండేది. అందువల్ల, తమకు సంబంధించినంతవరకు, అంటే ఆ మారకపు విలువలు మార్పులవల్ల తమ వ్యాపారానికి ఏవయినా కష్టనష్టాలు వస్తాయని అనుకున్నప్పుడు ఆ సమస్యలమీద వారు తర్జన భర్జనలు చేసేవారు. అంటేవారి లాభనష్టాలమేరకే నన్నమాట! ఆ ఇండియన్ కరెన్సీని చట్టబద్ధం చేయడం, ఆ చట్టంలోని విషయాలపైన, దానినుంచి ఉత్పన్నమయ్యే విషయాలపైన తర్జనభర్జనలు రావడం అన్నది 1908 నుంచీ ఉంది. దాని చరిత్ర అంత వెనక్కి వెళ్ళాలన్నమాట. నేను వ్రాసిన "హిందూదేశపు ఆర్థిక విధానము" (Indian Monetary System), "ప్రపంచ ఆర్థిక విధానము" (World Monetary System) అన్న పుస్తకాలలో ఈ విషయాలు బాగా లోతుగా చర్చించి ఉన్నాను.

ఆర్థిక ప్రతిపాదనల ఆంతర్యం

ఇక్కడ ఆ 1927-28 నాటి ఆర్హిక ప్రతిపాదనలను గురించి కొంచెం విపులంగా వివరిస్తాను. దేశీయులకు నష్టదాయకంగానూ, తమకు లాభకరంగాను మారకపు విలువలు మార్చాలని ప్రభుత్వం వారికి బుద్దిపుట్టినప్పుడల్లా, వారొక జిత్తులమారి నాటకం ఆడేవారు. ఆర్థిక విధానాన్ని చర్చించి, అవసరమైన సూచనలు చేయడానికంటూ "కరెన్సీ కమిషన్" అనేపేరున ఒక సంఘాన్ని నియమించి, వారి సూచనలను పాటిస్తున్నామనే వంకని, తమకు లాభదాయకమైన రీతిని (మనకు నష్టంవచ్చినా సరే) మారకపు విలువలు మారుస్తూ ఉండేవారు.

ఆ నాడు మారకపు రేటు 1షి. 4పెన్నీలు. "హిల్టన్ యంగ్ కమిటీ" వారు ఆగష్టు 20 న విడుదల చేసిన రిపోర్టులో సూచించిన మారకపు రేటును 1షి. 6 పె.లకు మార్చబోతున్నామని ప్రభుత్వంవారు శాసన సభలో వెల్లడించారు. ఆ మార్పు ఆంగ్లేయుల కెంతో లాభదాయకమైందిగానూ, హైందవ వాణిజ్య ప్రముఖులకూ, కర్షకులకూ ఎంతో నష్టాన్ని కలిగించేదిగానూ ఉంది.