పుట:Naajeevitayatrat021599mbp.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాన్ని ప్రక్కకు నెట్టాలనే అభిలాషతో యుక్తియుక్తంగా చేయబడిన సవరణ తీర్మానం అది.

ఈ పరిస్థితులలో మెంబర్ల ఆలోచనలన్నీ "సర్ జాన్ సైమన్" ఆధిపత్యాన్ని రానున్న రాయల్ కమీషన్‌మీద కేంద్రీకరింప బడ్డాయి. నిజానికి హిందూదేశానికే "సైమన్ కమిషన్" రావడానికి ఇంకా ఏడాది గడువుంది. అయితేనేం, ప్రజాభిప్రాయాన్ని అన్యమార్గాలు పట్టించడానికి, తర్జన భర్జన చేయవలసిన విశ్వాసరాహిత్యతీర్మానాన్ని మూలకు త్రోయడానికి ఈ సైమన్ కమిషన్ ప్రస్తావనకి ప్రాముఖ్యం ఇస్తూ, మద్రాసు శాసన సభలోని కాంగ్రెసువారిపై రానున్న అభియోగాన్ని చల్లచల్లగా జారవిడిచారు.

ఎల్లాగయితేనేం, మొత్తానికి డాక్టరు సుబ్బరాయన్‌గారి మంత్రివర్గం, కాంగ్రెసువారి సహకారంతో, పూరా మూడు సంవత్సరాలపాటు ఈడ్చుకుంటూ కొనసాగింది. 1929 ఆఖరి రోజులలో, ఉప్పు సత్యాగ్రహం, పేరుమీద కాంగ్రెసువారి కందరికీ వచ్చిన "పిలుపు" కారణంగా అంతమయింది.

19

శాసన సభ్యుని నిర్బంధంపై

కేంద్రసభలో సవాలు

1928-29 బడ్జెటు మీటింగులో కాంగ్రెసువారు మంత్రుల జీతాలకు వ్యతిరిక్తంగా ఓటు చేయలేదు. అల్లా అల్లా కాంగ్రెసుపార్టీవారి సహకారంతో సాగిన ఆ మంత్రివర్గం యావత్తు భారతదేశంలోనూ అసంతృప్తి కలిగించింది.

కేంద్ర శాసన సభ సంగతులు

కేంద్ర శాసన సభా సమాచారాలు కూడా కొంతవరకూ తెలుసుకోడం న్యాయం కదా! యు. పి. లో. జరిగిన ఎన్నికలలో పూర్తి